
viral video of marriage on social media
Viral Video : ప్రస్తుతం పెళ్లిళ్ల జోరు కొనసాగుతోంది. కరోనా తగ్గాక పెళ్లిళ్లు ఊపు అందుకున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లిళ్లే. ఈ మధ్య చాలా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి మండపంలో ఏవైనా చిలిపి ఘటనలు జరగడం.. అవి వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వీడియో కూడా వైరల్ అయింది. అది కూడా పెళ్లి మండపంలో తీసిందే. ఆ వీడియో చూస్తూ మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు. ముఖ్యంగా పెళ్లి కొడుకును చూసి మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరు. వరుడి పరిస్థితి అంత ఘోరంగా ఉంది అక్కడ.
viral video of marriage on social media
పెళ్లి అయిపోయింది. పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది. బంధువులు అందరూ వచ్చారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు వచ్చాడు. స్టేజ్ మీదికి ఎక్కి వెంటనే వధువు పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వాళ్లు ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడు వధువుతో చేసిన పని చూసి నోరెళ్లబెట్టారు.
వధువు పక్కన కూర్చున్న ఆ యువకుడు.. అంతటితో ఆగకుండా.. వధువుకు ముద్దుల మీద ముద్దులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ఘటన చూసి వరుడు బిత్తరపోయాడు. అసలు ఏం జరుగుతోందో.. వరుడికి అర్థం కాలేదు. బిక్క మొహం వేసి వాళ్ల వైపు అలాగే చూస్తూ కూర్చున్నాడు. బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే.. ఇదంతా కావాలని.. వరుడిని ఆటపట్టించాలని చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇలా వరుడి ముందే.. తన భార్యకు ముద్దులు ఇస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారా? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.