Viral Video : యువతి డ్యాన్స్ చేస్తుంటే.. పక్కనే ఉన్న కుక్క ఏం చేసిందో చూస్తే బిత్తరపోతారు?
Viral Video : ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సోషల్ మీడియాలోనే జనమంతా. ఏం జరిగినా సోషల్ మీడియాలోనే. ఏదైనా టాపిక్ గురించి చర్చ జరగాలన్నా సోషల్ మీడియాలోనే. సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఊహించలేం. అది సోషల్ మీడియాకు ఉన్న పవర్. సోషల్ మీడియాలో దేన్నయినా చాలా ఈజీగా వైరల్ చేసేయొచ్చు. జనాలు మాట్లాడుకునేలా చేయొచ్చు.

viral video of young girl dance and dog
ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో అది. తన డ్యాన్స్ చేయడం వల్ల.. ఆ వీడియో వైరల్ కాలేదు. లేదా.. తన డ్యాన్స్ చూసి జనాలు మెచ్చలేదు. తన వెనుక ఉన్న కుక్క చేసిన పని చూసి ఆ వీడియో వైరల్ అయింది. జనాలు తెగ నవ్వుకుంటున్నారు.
Viral Video : యువతి డ్యాన్స్ చేస్తుండగా.. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసిన కుక్క
సాధారణంగా అందరూ ఇండ్లలో కుక్కను పెంచుకుంటారు. ఓ యువతి తన పెంపుడు కుక్కను కట్టేసి.. తన డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇక.. ఆ కుక్క ఆగుతుందా? అది కూడా రెండు కాళ్ల మీద నిలబడి.. తన డ్యాన్స్ కు చప్పట్లు కొట్టింది. ఎంకరేజ్ చేసింది. చీర్స్ అంటూ తన డ్యాన్స్ కు ఫిదా అయిపోయింది. ఆ కుక్క చేసిన పని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఇది మామూలు కుక్క కాదు.. అంటూ జనాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Whatta dance partner! #dogsoftwitter #dogs #pets #pet #Dance #Dancer #ViralVideo #WhatsappWonderbox pic.twitter.com/Rnd1pi57Us
— Dhanraj Nathwani (@DhanrajNathwani) June 29, 2021