War 2 Collections | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ 2 ప్ర‌భంజ‌నం.. తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

War 2 Collections | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వార్ 2 ప్ర‌భంజ‌నం.. తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 August 2025,11:19 am

War 2 Collections | పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలకు స్పందన ఆశించిన స్థాయిలో లేకపోయినా… తొలి రోజు వసూళ్ల పరంగా మాత్రం సినిమా ట్రేడ్ సర్కిల్స్ అంచనాలను తుడిచిపెట్టేసింది. ‘వార్ 2’ రిలీజ్‌కు ముందు బుకింగ్స్ ఊపందుకోవడంలో ఆలస్యం కావడంతో కలెక్షన్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం

#image_title

అయితే విడుదలైన రోజు హిందీ మార్కెట్: ₹29 కోట్ల నెట్ కలెక్షన్లు, తెలుగు రాష్ట్రాల్లో: ₹23.25 కోట్ల నెట్ కలెక్షన్లు, ఇతర ప్రాంతాలు (ఇండియా): ₹50 లక్షల దాకా కలెక్ట్ చేసింది. ఇలా కలిపితే ఇండియా నుంచే రూ. 52.5 కోట్లు గ్రాస్ రాబట్టింది.ఇంకా పూర్తి వివరాలు రానప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 40 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు సమాచారం. వార్ 2 విడుదలకు ముందు ట్రేడ్ వర్గాలు ఈ సినిమాకు ఫస్ట్ డే 35-40 కోట్ల లోపే వసూళ్లు ఉంటాయన్న అంచనా వేశారు.

కానీ ఆ అంచనాలను దాటి తొలిరోజే సినిమా 90 కోట్లకు చేరువగా గ్రాస్ సాధించింది. మరి ఇది వంద కోట్ల క్లబ్‌ను దాటి వెళుతుందా లేదా అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమా ఈ స్థాయిలో (23 కోట్లకు పైగా) వసూళ్లు రాబట్టిన దాఖలాలు చాలా తక్కువ. ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్‌కు నిదర్శనం. బాలీవుడ్ నుంచి ‘వార్ 2’ కు వచ్చిన రివ్యూస్ మాత్రం బలహీనంగా ఉండగా, తెలుగులో మాత్రం “పర్వాలేదు” అన్న టాక్ నెలకొంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది