War 2 | వార్ 2 ఇప్ప‌టి వ‌రకు ఎంత క‌లెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రావాలి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

War 2 | వార్ 2 ఇప్ప‌టి వ‌రకు ఎంత క‌లెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రావాలి?

 Authored By sandeep | The Telugu News | Updated on :18 August 2025,11:59 am

War 2 | గత వారం విడుదలైన ‘వార్ 2’ , ‘కూలీ’ (Coolie) సినిమాలు బాక్సాఫీస్ వద్ద హైప్‌కు తగ్గ కలెక్షన్లు తెచ్చుకున్నా, వ్యూయర్స్ రివ్యూస్ పరంగా మాత్రం యావరేజ్ టాక్‌కే పరిమితమయ్యాయి. ఒకటి తమిళ్ సినిమా, మరొకటి బాలీవుడ్ సినిమా అయినా, ఈ రెండు చిత్రాల్లో తెలుగు హీరోలు (ఎన్టీఆర్, నాగార్జున‌) ఉన్నందున తెలుగు మార్కెట్‌లో భారీ బిజినెస్ జరిగింది.

ఎంత వ‌సూళ్లు అంటే..

ప్రముఖ నిర్మాత నాగవంశీ వార్ 2 సినిమాకు తెలుగు రైట్స్‌ను రూ. 90 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని సమాచారం. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్: ₹85 – ₹90 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) గ్రాస్: ₹265 కోట్లు (అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం),బ్రేక్ ఈవెన్ టార్గెట్ (WW షేర్): ₹350 కోట్లు షేర్ (అంటే సుమారుగా ₹700 కోట్లు గ్రాస్), తెలుగు మార్కెట్ గ్రాస్: ₹75 కోట్లు, తెలుగు బ్రేక్ ఈవెన్: కనీసం ₹180 కోట్లు గ్రాస్ రాబ‌ట్టింది.

సినిమా వసూళ్లు మొదటి రోజు బాగున్నా, అడ్వాన్స్ బుకింగ్స్, మౌత్ టాక్ విషయంలో కాస్త వెనకబడినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. స్పై యాక్షన్ జానర్‌కు బాలీవుడ్ ఆడియెన్స్ పెద్దగా కొత్తగా ఫీల్ కాకపోవడం, కంటెంట్ పరంగా ‘ఓకే’ అనిపించడంతో రిపీట్ ఆడియెన్స్ తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూలీ చిత్రం ఫస్ట్ డే గ్రాస్: ₹151 కోట్లు (అధికారిక ప్రకటన), ఫస్ట్ వీకెండ్ గ్రాస్: ₹385 కోట్లు సాధించింది. వార్ 2 కంటే ₹120 కోట్లు ఎక్కువ వసూలు చేసింది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది