
warangal police arrestes former army employee
Warangal : చేతిలో మంచి జాబ్ ఉంది. ఆర్మీ ఉద్యోగిగా మంచిగానే సంపాదిస్తున్నా.. అతడి వక్రబుద్ధే అతడిని కటకటాల పాలు చేసింది. జల్సాలకు అలవాటు పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకు ఆ మహిళనే చంపేశాడు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇంకా దిగజారాడు. దొంగగా మారాడు. జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో చోటు చేసుకుంది.
warangal police arrestes former army employee
భూపాలపల్లి సమీపంలోని రేగులగూడానికి చెందిన మహేశ్ అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కేసముద్రానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఆ మహిళను కొన్ని రోజులకు ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. దీంతో తన నేరం రుజువు అయి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో ఆర్మీ ఉద్యోగం పోయింది. జైలులో కొన్ని రోజులు ఉన్నాక.. బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక తన భార్య కూడా విడాకులు ఇచ్చింది.
విడాకులు ఇవ్వడంతో పాటు.. భార్య.. తనకు ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చేయాలని అడిగింది. దీంతో తన భార్యకు డబ్బులు ఇవ్వడం కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు మహేశ్. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి పలు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు చాలాసార్లు పట్టుబడ్డాడు. తర్వాత కొన్ని రోజులు విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్ లో పని చేశాడు.
ఆ తర్వాత మళ్లీ దొంగతనం చేయడం ప్రారంభించాడు. దొంగతనం చేయడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం.. ఇదే అలవాటుగా చేసుకున్నాడు. ఇలాగే ఒక ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు దోచుకొని.. విజయవాడ వెళ్లేందుకు భూపాలపల్లి బస్ స్టాండ్ కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన బస్ స్టాండ్ కు వెళ్లి మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మహేశ్ దగ్గర ఉన్న బంగారం, వెండి, 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.