Salt : ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు కచ్చితంగా వాడుతూ ఉంటారు. ఉప్పు లేనిదే ఏ వంటా కూడా పూర్తి కాదు.కానీ ఉప్పు చేసే మేలు కంటే, కీడే ఎక్కువగా ఉన్నది. అందుకే ఉప్పు ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతుంది అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి WHO తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సిఫారస్ లను జారీ చేస్తూ ఉంది. ఏ వ్యాధి నుండి జాగ్రత్తపడాలి. ఏ వ్యాధి తీవ్రమైనది,ఏది కాదు అనే సమాచారం ప్రతిసారీ మనకు అందిస్తూనే ఉన్నది. ఇది కాకుండా పౌరుడు ఎలాంటి ఆహారాలు తినాలి, ఏమి తినకూడదు అనే సమాచారాలను కూడా తరచుగా అందిస్తూ ఉన్నది. ఈ టైంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించింది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులకు ఏమి జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ఈ సమాచారం తెలిపింది. ఉప్పు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది అనే విషయాల గురించి ఎప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలకు సంబంధించిన వ్యాధులు ఎన్నో పెరగటం వలన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూస్తే, ఐరోపాలో ప్రతిరోజు కనీస 10,000 మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు అని తెలిపింది. అనగా ఏట 40 లక్షల మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు అంట. యూరప్ లోనే మొత్తం మరణాలలో 40 శాతం మంది గుండెకు సంబంధించి జబ్బుల కారణం వలన ఈ మరణాలు అనేది సంభవిస్తున్నాయి…
ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన ఈ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఉప్పు తీసుకోవడం తగ్గించటం వలన ఈ సంఖ్యను తగ్గించుకోవచ్చు. రోజు తీసుకున్న ఉప్పులో కనీసం 20 శాతం వరకు తగ్గించాలి. అలా జరిగితే 2030 నాటికి తొమ్మిది లక్షల మరణాలను అరికట్టవచ్చు. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు…
ఐరోపాలో 30 నుండి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న ముగ్గురిలో ఒకరు ఎక్కువ రక్తపోటుతో బాధపడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఉప్పే. ఐరోపాలో 53 దేశాలలో 51 దేశాలు ప్రతిరోజు ఉప్పును ఐదు గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేక అంతకంటే తక్కువ తినాలి అని సిఫారస్ చేస్తుంది. అనగా ఒక టీస్పూన్ లేక అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం చాలా మంచిది. కానీ ఐరోపాలో దీనిని విస్మరించి ఎక్కువగా వాడుతున్నారు.యూరోపియన్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు స్నాక్స్ ఎక్కువగా తీసుకోవటానికి ఇష్టపడతారు. వీటిలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కావున ఈ ఆహారాలు తినటం మానుకోవాలి అని సూచిస్తున్నారు.
ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అనేది పెరుగుతుంది. ఇది గుండె సంబంధించిన సమస్యలకు కూడా దారితీస్తుంది. కావున గుండెపోటు రావచ్చు అని ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు రోగులు యూరోప్ లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూస్తే, గుండె సంబంధించిన సమస్యల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు అని తెలిపింది. ఈ నిష్పత్తి 2.5 గా ఉన్నట్లుగా తెలిపింది…
30,69 ఏళ్ల వయసుగల వ్యక్తులు కూడా పశ్చిమ ఐరోపాల్లో కంటే తూర్పు ఐరోపాలో,మధ్య ఆసియాలో గుండెకు సంబంధించిన సమస్యలతో చనిపోయే అవకాశాలు 5% ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. కావున ఈ గుణాంకాలు ఐరోపా కు చెందినప్పటికీ కూడా ఏ దేశంలో నైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వారు కూడా గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు. అందుకే ఉప్పను తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.