Home » Health » What Causes Yellow Teeth And Discouloration
Health

BRUSH | నిత్యం బ్ర‌ష్ చేస్తున్నా కూడా మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 30, 2025, 7:00 am
Advertisement

BRUSH | ఆరోగ్యకరమైన జీవనానికి శరీరంలోని ప్రతి అవయవం లాగే దంతాల సంరక్షణ కూడా అత్యంత ముఖ్యమైంది. అయితే రోజూ బ్రష్‌ చేస్తున్నప్పటికీ కొందరికి పసుపు దంతాల సమస్య వేధిస్తుంది. ఇది కేవలం రూపాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, దంతాల ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తుంది. నిపుణుల ప్రకారం దంతాలు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం విటమిన్ డి లోపమే.

Advertisement

#image_title

కార‌ణాలు ఏంటి?

Advertisement

శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు దంతాల ఎనామిల్ బలహీనమవుతుంది. ఎనామిల్ కోల్పోవడం వల్ల దంతాల లోపలి పొర అయిన పసుపు డెంటిన్ బయటకు స్పష్టంగా కనిపించి, దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇది తరువాత పంటి నొప్పి, దంతాల బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఈ సమస్యను నివారించడానికి విటమిన్ డి పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, చేపలు, పాలకూర, పుట్టగొడుగులు విటమిన్ డి కు ప్రధాన వనరులు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్ ఆమ్లం దంతాలను సహజంగా మెరిపిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తాయి.

Advertisement

అందువల్ల పసుపు దంతాల సమస్యను ఎదుర్కొంటున్న వారు సరైన ఆహార అలవాట్లతో పాటు దంత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి