Whatsapp : దొంగను పట్టించిన వాట్సప్ డీపీ ఫోటో.. అడ్డంగా బుక్ అయిన పనిమనిషి..!!
Whatsapp : యజమాని ఇంట్లో ఓ పనిమనిషి చేసిన అత్యుత్సాహం.. దొంగతనం ఆమెను అడ్డంగా బుక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఓ ధనవంతుల కుటుంబంలో ఓ పనిమనిషి ఎప్పటినుండో నమ్మకంగా పనిచేస్తూ ఉండేది. దీంతో ఆ ధనవంతుల కుటుంబ సభ్యులు ఆమెను పనిమనిషిలా కాకుండా కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకోవడంతో.. పాటు ఇంట్లో రహస్యాలు కూడా ఆమెతో చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబం బయటకు వెళ్లిన సందర్భాలలో సదరు […]
Whatsapp : యజమాని ఇంట్లో ఓ పనిమనిషి చేసిన అత్యుత్సాహం.. దొంగతనం ఆమెను అడ్డంగా బుక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఓ ధనవంతుల కుటుంబంలో ఓ పనిమనిషి ఎప్పటినుండో నమ్మకంగా పనిచేస్తూ ఉండేది. దీంతో ఆ ధనవంతుల కుటుంబ సభ్యులు ఆమెను పనిమనిషిలా కాకుండా కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకోవడంతో.. పాటు ఇంట్లో రహస్యాలు కూడా ఆమెతో చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబం బయటకు వెళ్లిన సందర్భాలలో సదరు పనిమనిషి కన్ను ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలపై పడింది.
దీంతో వెంటనే బీరువాలో ఉండే 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఎవరికి తెలియకుండా దొంగతనం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చాక బీరువా చూస్తే ఆభరణాలు మొత్తం మాయమై ఉన్నాయి. అయితే పనిమనిషి పై నమ్మకం ఉండటంతో ఆమె మీద ఎవరికి అనుమానం రాలేదు. దీంతో సదరు ధనవంతుల కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసులు క్లోజ్ టీం సహాయంతో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబ సభ్యులతో పాటు పనిమనిషిని కూడా విచారించారు. అయితే పనిమనిషి పై నమ్మకం ఉండటంతో… ఆమెను పోలీసులు కూడా అనుమానించలేదు.
ఇటు కుటుంబ సభ్యులకు మొదటినుండి.. నమ్మకం ఉండటంతో ఆమెను లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఇంట్లో నగలు దొంగతనం జరిగి నెలలు గడిచిన దొంగతనానికి సంబంధించి ఎలాంటి ఆధారం లభించలేదు. ఇక దొంగతనం అందరూ మర్చిపోయారు అని పనిమనిషి భావించి… ఎప్పటికీ బయటపడదు అని సంబరపడిపోయింది. దీంతో దెంగించిన ఆభరణాలను మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసి పెట్టుకుని ఫోటోలు దిగుతూ రకరకాల ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఏంటి యజమాని మామూలుగా వాట్సాప్ డీపీలు చూస్తూ ఉండగా పనిమనిషి పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తన ఇయర్ రింగ్స్ లాగే ఉండటంతో.. కాస్త అనుమానం వచ్చింది. అదే సమయంలో కొన్ని రోజుల నుండి పనిమనిషి ప్రవర్తనలో కాస్త తేడా ఉండటంతో వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పనిమనిషి పై నిగా పెట్టి పక్క ఆధారాలు సేకరించి…. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ పనిమనిషి నుండి బంగారు ఆభరణాలతో పాటు ₹5 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.