WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు పండగే.. పండగ.. ఇక ఆ సంఖ్య డబుల్

 Authored By mallesh | The Telugu News | Updated on :9 May 2022,8:30 pm

WhatsApp Users : ప్రముఖ సోషల్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు ఉన్నారు. వారి అభిమానాన్ని చూరగొనేందుకు వాట్సాప్ అనేక అప్ డేట్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారిని సర్ ప్రైజ్ చేయాలనే లక్ష్యంతో ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లు యూజర్లకు కూడా తెగ నచ్చుతూ ఉంటాయి. అలా వాట్సాప్ యూజర్ బేస్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. మార్కెట్లో ఎన్ని పోటీ యాప్స్ వచ్చినా కానీ వాట్సాప్ ను ఢీ కొట్టలేక చతికిల పడిపోతున్నాయి.వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్​ ను తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాటింగ్ చేసుకునే సభ్యులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఇన్ని రోజులు వాట్సాప్ లో ఉన్న గ్రూపుల్లో కేవలం 256 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అంత కంటే లిమిట్ ఎక్కువ అయితే సభ్యులను యాడ్ చేయడం వీలు కాకపోయేది. కానీ వాట్సాప్ ఇప్పుడు ఈ నంబర్ ను డబుల్ చేసింది. ఇక మీదట నుంచి వాట్సాప్ గ్రూప్ లో 512 మందిని యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ ప్రకటించింది.ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఇప్పుడు ఈ గ్రూప్ సభ్యుల ఫీచర్ ను కూడా యాడ్ చేసింది.

whatsapp users festive and Introducing new features

whatsapp users festive and Introducing new features

అంతే కాకుండా కమ్యూనిటీ గ్రూప్ చాట్ పేరుతో ఫీచర్ ను కూడా యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ కూడా యూజర్లకు ఎంతో ఉపయోగపడనుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏంచక్కా గ్రూప్ చాట్ చేసుకోవచ్చు.ఇవే కాకుండా మరో గుడ్ న్యూస్ ను కూడా వాట్సాప్ తన యూజర్లకు చెప్పింది. అదే ఫైల్ పరిమాణం. ఇప్పటి వరకు వాట్సాప్ లో 100 సైజులో ఉండే ఫైల్స్ ను మాత్రమే పంపించుకునేందుకు వీలుండేది. కానీ ఇక నుంచి ఆ సైజును 2జీబీకి పెంచనున్నట్లు వాట్సాప్ తెలిపింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి