
When Undvalli Met With KCR
KCR : అప్పుడేమో తిట్టారు, ఆ తర్వాత అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం అనేది గతం. భవిష్యత్ అంతా జాతీయ రాజకీయం.! ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త నినాదంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా, రాజకీయ ప్రత్యర్థులనుకున్నవారిని అక్కున చేర్చుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర.. అన్న విభజన రేఖ ఇకపై వుండకపోవచ్చు. ఎందుకంటే, వీర సమైక్యవాది ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు మరి.
ఆ మాటకొస్తే, చాలామంది సమైక్యవాదులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకప్పుడు సమైక్యవాది. కానీ, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు కీలక నేత. మజ్లిస్ పార్టీది కూడా సమైక్యవాదమే. కానీ, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మిత్రపక్షం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై వివాదం వుంది. ఆ వివాదాన్ని పరిష్కరించగలిగితే, కేసీయార్ జాతీయ రాజకీయాలకు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ వుంటుంది. అలాగని, కేసీయార్ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంగీకరిస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే, ‘వలస పాలకులు..’
When Undvalli Met With KCR
అంటూ ఇప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకులపై మండిపడుతూనే వుంటారు.అయితే, ఇకపై అలాంటి గలాటా వుండబోదని ఉండవల్లి, కేసీయార్ భేటీతో చాలామందికి స్పష్టత వచ్చేసింది. రాజకీయాల్ని వదిలేసి, ‘మేధావి వర్గం’లో చేరిపోయిన ఉండవల్లి అరుణ్ కుమార్, జాతీయ రాజకీయాలపై తనకున్న అవగాహను, కేసీయార్ దృష్టికి తీసుకెళ్ళారట. జాతీయ రాజకీయం అంత తేలిక కాదని ఈ మాజీ ఎంపీ, తెలంగాణ రథ సారధితో చెప్పారనే ప్రచారం జరుగుతోంది.రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కేసీయార్ పెట్టబోయే జాతీయ పార్టీతో మళ్ళీ ఉండవల్లి రాజకీయాల్లోకి వస్తేనో.?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.