Pawan Kalyan : బీజేపీ పేరు చెప్తే పవన్ కి కోపం వస్తోందా?
Pawan Kalyan : ఏపీలో బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య బీజేపీతో కలిసి తిరిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకో బీజేపీపై మొహం చాటేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానాన్ని కలిసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో దూరంగా ఉంటున్నారు. బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ ను కేంద్రం పెద్దలు అఫిషియల్ గానే అన్ని కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. కానీ.. ఆయన మాత్రం ఎందుకో ఢిల్లీకి వెళ్లడానికే ఇష్టపడటం లేదు.
తనకు డైరెక్ట్ గా కేంద్రంతోనే సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీకి వెళ్లేందుకు సుముఖత పెంచడండం లేదో అర్థం కావడం లేదు. అందుకే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ను కలవలేదు. ప్రధాని మోదీ ఏపీకి వచ్చినా.. బీమవరంలో పర్యటించినా కూడా పవన్ కళ్యాణ్ మోదీని కూడా కలవలేదు. ప్రధాని వస్తే.. జనసేన అధినేతగా తను వెళ్లి ప్రధానిని కలవాల్సి ఉంది. కానీ.. తన సోదరుడు చిరంజీవి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లలేదు.
Pawan Kalyan : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకూ దూరంగా ఉన్న పవన్
హైదరాబాద్ లో రెండు రోజులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇటీవల జరిగాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలకు వెళ్లలేదు. ప్రధాని మోదీతో సహా.. బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ లో ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం ఎవ్వరినీ కలిసే ప్రయత్నం చేయలేదు.
అసలు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారా లేదా అనే డౌట్ అందరికీ వచ్చేలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిహేవ్ చేస్తున్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కు కూడా పవన్ అటెండ్ కాలేదు. మరోవైపు రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ బీజేపీ పాదయాత్ర చేస్తోంది. అది కూడా జనసేనకు పట్టడం లేదు. మరోవైపు బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ఓవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. బీజేపీతో పొత్తు ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఎందుకు.. బీజేపీతో పవన్ కు ఎక్కడ చెడింది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసే ప్రయత్నం చేసినా.. దానికి కాలమే సమాధానం చెబుతుంది అని వెయిట్ చేస్తున్నారు.