Wife Revenge That Wife Written About Her Husband On His Grave
Wife Revenge : సృష్టిలో అన్నింటికన్నా బలమైనది పెళ్లి. అందుకే పెళ్లి చేసుకున్న వారు అన్యోన్యంగా కలిసి ఉంటారు. అయితే దంపతులు అందరూ ఆనందంగా ఉండాలని ఏమి రూల్ లేదు. కొంతమంది గొడవలు పడుతూనే ఉంటారు. మరికొందరు గొడవల్లో కూడా కలిసే ఉంటూ.. ఏదోలా తమ రిలేషన్‌ను కొనసాగిస్తూ ఉంటారు. ఇక మరికొందరైతే ఇలా గొడవలు పడటం ఇష్టం లేక విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇది వారికి మనశ్శాంతిని ఇస్తుందని వారు నమ్ముతుంటారు. అయితే, పిల్లలు ఉన్నవాళ్లు వారి కోసం సర్దుకుపోతుంటారు. పిల్లలు లేని వారు విడాకులు తీసుకునేందుకు దైర్యం చేస్తారు. అయితే చనిపోయిన భర్త సమాధి మీద భార్య రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
భర్త మీద పీకల్లోతు కోపం ఉన్న ఓ ఇల్లాలు, అతడు చనిపోయిన సమాధిలో శాశ్వతనిద్రలో ఉంటే.. ఆమె ఎవరూ ఊహించని పని చేసింది. అతడి గురించి ఆమె బూతులు రాసింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్య ఇలా ఎలా చేస్తుందంటూ అందరూ మండిపడుతున్నారు.కానీ ఆమె ఎందుకు చేయాల్సివచ్చిందని మాత్రం కారణాలు వెతకడం లేదు. ఏదేమైనా భార్య చేసిన పనికి ఆ భర్త మరణించినా కూడా అతని ఆత్మకు శాంతి దొరకదని కొందరు అనుకుంటున్నారు. అమెరికాకు చెందిన జాన్ డోయ్ అనే వ్యక్తికి పెళ్లి అయ్యింది. అతడికి కొడుకు కూడా ఉన్నాడు.
Wife Revenge That Wife Written About Her Husband On His Grave
కొన్నాళ్ల తర్వాత అతడికి ఆఫీసులో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం, ఆ తర్వాత వారిద్దరు శారీరకంగా సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే తన భార్యను వదిలేసి జాన్ డోయ్ తన ప్రేయసితోనే ఉండసాగాడు. అయితే తన ప్రియురాలితో సెక్స్ చేస్తూ జాన్ ప్రాణాలు విడిచాడు. జాన్ మరణించడంతో అందరూ అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే భర్త మీద పీకల్లోతు కోపంగా ఉన్న ఆ భార్య అతడి సమాధి మీద బండ బూతు రాసింది. అతడి సమాధిపై ‘ జాన్ డోయ్ జ్ఞాపకార్థంగా.. జాన్ డోయ్ ఓ తండ్రికి కొడుకు.. ఓ భార్యకు భర్త.. ఓ కొడుక్కి తండ్రి.. ఓ వ్యభిచారి’ అని రాసింది. దీంతో జాన్ కొడుకుతో పాటు బంధువులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.