Home » Exclusive » Woman Who Married Ghost Wants A Divorce
Exclusive

Woman Married Ghost : దయ్యాన్ని పెళ్లి చేసుకుంది .. మళ్ళీ విడాకులు తీసుకుంది .. వింతలకే వింత ఇది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 12, 2023, 10:00 am
Advertisement

Woman Married Ghost : దయ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అందులో మళ్లి విడాకులు తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అని అందరికీ వచ్చే డౌట్. కానీ ఈ మహిళ దయ్యాలు ఉన్నాయని తనతో మాట్లాడిందని, హనీమూన్ కూడా మాకు జరిగిందని చెబుతోంది. ఇప్పుడు ఆ దయ్యం మొగుడు తనని టార్చర్ పెడుతున్నాడని, అందుకే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. బ్రిటన్ కు చెందిన రాకర్ బ్రోకర్డ్ అనే మహిళ ఎడ్వార్డ్ దయ్యాన్ని పెళ్లి చేసుకుందట.

Advertisement

Woman Who Married Ghost Wants A Divorce

అది కూడా హాలోవిన్ 2022 వేడుకలో పాడుబడిన చర్చిలో పెళ్లి చేసుకుందట. ఆ మహిళ దెయ్యం పరిచయం అయిన ఐదు నెలలకు పెళ్లి చేసుకుందట. తన దెయ్యం భర్త నిత్యం తనకు నరకం చూపిస్తున్నాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి భూతవైద్యుడు దగ్గరికి కూడా వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. పెళ్లి ఎంత నరకం అనేది తన అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు బ్రోకర్డ్ చెబుతుంది. అంతేకాకుండా ఆ మహిళ తనను దెయ్యం మొగుడు పెళ్లి చేసుకున్నప్పుడు మార్లిన్ మన్రో ఎల్విన్ హెన్రీ కూడా పెళ్లికి వచ్చారని, మార్లిన్ మన్రో పట్ల దయ్యం మొగుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెబుతోంది.

Advertisement

హనీమూన్ రోజు కూడా డిసప్పాయింట్ చేసి ఐస్ క్రీమ్ తినిపించడానికి విఫలయత్నం చేసి సర్వనాశనం చేశాడంటూ ఆమె ఏదేదో చెప్పుకోస్తోంది. తన దెయ్యం మొగుడు తో విడాకులు తీసుకుందామని అతడికి చెబితే అసలు పట్టించుకోకుండా చిన్నపిల్లాడిలా ఏడుస్తూ తనకి రోజు నరకం చూపిస్తున్నాడని బ్రోకర్డ్ చెబుతోంది. అయితే ఈ మహిళ చెప్పిన దాంట్లో ఎంత మాత్రం నిజం ఉన్నదనేది అర్థం కావడం లేదు. అసలు నిజంగా ఈమె దయ్యాన్ని చూసిందా లేక మానసిక రోగినా అని డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ దయ్యం కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి