Ramdev Baba : బట్టలు లేకపోయినా అంటూ మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో
Ramdev Baba: యోగా గురువు బాబా రాందేవ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే మహారాష్ట్ర థానేలో శుక్రవారం జరిగిన పతాంజలి యోగా పీట్ కార్యక్రమంలో మహిళలు చీరల్లో బాగుంటారని అన్నారు. ఆ తర్వాత సల్వార్ సూట్లలో కూడా బాగా కనిపిస్తారని నా కళ్ళకు అయితే వాళ్ళు బట్టలు లేకపోయినా గాని బాగుంటారని బాబా రాందేవ్ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. యోగ తరగతులకు వస్తున్న మహిళలను ఉద్దేశించి..
ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమంలో వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫట్నవిస్, సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉండటం జరిగింది. వాళ్ల సమక్షంలోనే రాందేవ్ బాబా.. మహిళలపై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్… రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Women would look good even if they don’t wear anything Baba Ramdev controversial statement
ఆయన మనస్తత్వం ఏంటో బయటపడిందని విమర్శలు చేశారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో అర్థం అవుతుందని మండిపడ్డారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న నాయకులను ఇరుకున పెడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మహిళలు సైతం రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో రాందేవ్ బాబా పై నెటిజన్ లు తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
