Yamaha E10 Electric Scooter : య‌మ‌హా నుంచి మ‌రో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్.. ఎక్క‌డైనా ప‌రుగులు పెట్టే సామ‌ర్థ్యం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Yamaha E10 Electric Scooter : య‌మ‌హా నుంచి మ‌రో ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్.. ఎక్క‌డైనా ప‌రుగులు పెట్టే సామ‌ర్థ్యం

Yamaha E10 Electric Scooter : ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్ వేహిక‌ల్స్ కు మంచి డిమండ్ ఉంది. పెట్రో, డీజిల్ రేట్లు రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో సామాన్యులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప‌లు కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. కేంద్ర‌ప‌భుత్వం కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీని ప్రోత్స‌హిస్తోంది.ఈ వాహ‌నాల‌కు లైసెన్స్ నిబంధ‌న‌ల‌ను కూడా మిన‌హాయింపును కూడా క‌ల్పిస్తోంది. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 April 2022,7:00 pm

Yamaha E10 Electric Scooter : ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్ వేహిక‌ల్స్ కు మంచి డిమండ్ ఉంది. పెట్రో, డీజిల్ రేట్లు రోజురోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో సామాన్యులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప‌లు కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. కేంద్ర‌ప‌భుత్వం కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీని ప్రోత్స‌హిస్తోంది.ఈ వాహ‌నాల‌కు లైసెన్స్ నిబంధ‌న‌ల‌ను కూడా మిన‌హాయింపును కూడా క‌ల్పిస్తోంది. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ పథకాన్ని కూడా ఇదివ‌ర‌కే అమల్లోకి తెచ్చింది.

గ‌తేడాది ఫేమ్‌ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్నిపెంచుతూ దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.కాగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసేందుకు టూవీలర్‌ దిగ్గజం యమహా మోటార్స్ సిద్దమవుతోంది. తాజాగా తమ‌ కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ యమహా ఈ 01 వెహిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను స్టార్ట్ చేసింది. థాయిలాండ్‌, తైవాన్‌, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా ఈ 01 లాంచ్‌ చేసేందుకు కంపెనీ ప్ల‌న్ చేస్తోంది. అన్నీ పరిస్థితుల్లో తట్టుకునేలా రూపొందించనుంది. అందుకోసమే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ 01ను ట్ర‌య‌ల్ ర‌న్ చేయ‌నుంది. రానున్న రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూరప్‌, జపాన్‌లో కూడా ఈ స్కూటర్‌పై పరీక్షలు నిర్వహించనున్నారు.

yamaha E10 Electric Scooter testing begins 100kms range with great features

yamaha E10 Electric Scooter testing begins 100kms range with great features

సిటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ డిజైన్ చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది.యమహా ఈ 01 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 4.9 కేడ‌బ్ల్యూఎచ్ లిథియం అయాన్‌ బ్యాటరీతో లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ సహాయంతో 5000 ఆర్‌పీఎం వద్ద 8.1 కేడ‌బ్ల్యూ అలాగే 1,950 ఆర్పీఎం వద్ద 30.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ స్కూటర్ ను సుమారు 100 కి.మీ రేంజ్ తో స‌హా మూడు పవర్ మోడ్‌లతో పాటు రివర్స్ మోడ్‌లో వస్తోంది. అలాగే స్కూటర్‌లో మూడు ర‌కాల ఛార్జింగ్ ఆప్ష‌న్స్ అందుబాటులో ఉంటాయిని కంపెనీ తెలిపింది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది