Chandrababu : చంద్రబాబు చేసిన వ్యాఖ్యలన్నీ జగన్ కి ఫేవరేనా.?
Chandrababu : అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శించుకోవడం ఎక్కడైనా కామనే కదా. ఏపీలో కూడా కామనే. తాజాగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే అది గన్నవరందే. గన్నవరంలో జరిగిన రచ్చ గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. అదే ఘటనను చంద్రబాబు కూడా మళ్లీ ప్రస్తావించారు. ఆ ఘటన విషయంలో వైఎస్ జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు చంద్రబాబు. వైసీపీ దౌర్జన్యాలపై విధ్వంసకర పాలన నుంచి ఏపీని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేస్తోంది..
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలి.. అని చంద్రబాబు పిలుపునిచ్చారు. గన్నవరంలో టీడీపీ నేతలపై, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికే పెను విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఓ లేఖ రాశారు. అప్రజాస్వామిక ధోరణులను ప్రశ్నిస్తే.. హింసాత్మక చర్యలకు పాల్పడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నియంతృత్వ పాలనలో అసలు సామాన్యుల ఆస్తులకు కూడా భద్రత లేకుండా పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు.
Chandrababu : సామాన్యుల ఆస్తులకు భద్రతే లేకుండా పోయింది
ఎంతో కష్టపడి, చమటోడ్చి సంపాదించిన పేదల ఆస్తులను వైసీపీ నేతలు బెదిరించి మరీ అక్రమంగా లాగేసుకుంటున్నారు. ఆక్రమించుకుంటున్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పేదలను హింసిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను చంపేస్తారా? అణగారిన వర్గాల గొంతు నొక్కడమే గన్నవరం హింసాకాండకు నిదర్శనం. ఇన్ని రోజలు వేరు. ఇప్పుడు వేరు. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణికి మధ్య పోరాటం జరుగుతోంది. దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు తనతో కలిసి రావాలి.. అని చంద్రబాబు పిలుపునిచ్చారు.