YCP Ministers : కూటమి హవా.. వెనుకంజ‌లో ఉన్న వైసీపీ మంత్రులు వీరే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YCP Ministers : కూటమి హవా.. వెనుకంజ‌లో ఉన్న వైసీపీ మంత్రులు వీరే..!

YCP Ministers : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా చూపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే సెంచరీ మార్కును దాటేలాగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పలువురు మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు.. జోగి రమేష్‌, తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా ఓటమి బాటలో పయనిస్తున్నారు. వైసీపీకి పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి కూటమి […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,10:49 am

YCP Ministers : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా చూపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే సెంచరీ మార్కును దాటేలాగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పలువురు మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు.

మంత్రులు రోజా, అంబటి రాంబాబు.. జోగి రమేష్‌, తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా ఓటమి బాటలో పయనిస్తున్నారు. వైసీపీకి పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు.

YCP Ministers కూటమి హవా వెనుకంజ‌లో ఉన్న వైసీపీ మంత్రులు వీరే

YCP Ministers : కూటమి హవా.. వెనుకంజ‌లో ఉన్న వైసీపీ మంత్రులు వీరే..!

లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాలతో కూటమి శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీ చాలా తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ 124 స్థానాల్లో, జనసేన 18, వైఎస్సార్ సీపీ 23 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది