Mekathoti Sucharita : పార్టీ మారుతున్నారా అని అడగగానే మాజీ హోమ్ మంత్రి సుచరిత ఆన్సర్ చూడండి..!!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 5, 2023, 6:00 pm

Mekathoti Sucharita : మేకతోటి సుచరిత తెలుసు కదా. తను ఏపీ మాజీ హోం మంత్రి. వైసీపీ ఎమ్మెల్యే. గత సంవత్సరం మంత్రివర్గ విస్తరణలో భాగంగా తన మంత్రి పదవిని ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె పార్టీకి అంటిముట్టనట్టే ఉన్నారు. తనలో కొంచెం మార్పు వచ్చింది. తన మంత్రి పదవి పోవడం వల్ల తను వైసీపీ పార్టీలో కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరుతారా అనే అనుమానం అందరిలో కలిగింది. దీంతో.. తాను వైసీపీలోనే ఉంటానంటూ చాలాసార్లు సుచరిత చెప్పుకొచ్చారు.

అయితే.. తను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈనేపథ్యంలో త్వరలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఇప్పుడు సుచరిత అడుగు ఎటువైపు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి.. సుచరితకు సీఎం జగన్ పార్టీలో మంచి స్థానం అందించారు. సుచరిత కూడా జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అందుకే.. ఆమెకు తొలి కేబినేట్ లోనే హోం మంత్రి అవకాశం వచ్చింది. కాకపోతే కేబినేట్ విస్తరణలో ఆమె తన మంత్ర పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ycp mla mekathoti sucharita comments on her party change

ycp mla mekathoti sucharita comments on her party change

Mekathoti Sucharita : భర్త అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పిన సుచరిత

తన రాజకీయాలు మొత్తం వైసీపీతోనే అని చెప్పుకొచ్చారు సుచరిత. కాకపోతే.. తన భర్త దయాసాగర్ ఏం చెబితే అది అని అంటున్నారు. నిజానికి తన భర్త కూడా ఇప్పుడు వైసీపీతోనే ఉంటా అని మాటిచ్చారు. కానీ.. భవిష్యత్తులో ఆయన పార్టీ మారితే.. తనతో పాటు రమ్మంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చారు. నేను ఒక పార్టీలో, నా భర్త ఒక పార్టీలో, నా పిల్లలు ఒక పార్టీలో ఉండటం అంటే అది అసాధ్యం అని.. తామంతా ఒకే పార్టీలో ఉంటామని సుచరిత స్పష్టం చేశారు.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  2. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  3. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  4. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  5. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  6. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

  7. "Ration Card : రేషన్ కార్డు ఉన్న మహిళలకు రేవంత్ ప్ర‌భుత్వం అదిరే గుడ్‌న్యూస్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp