Vinayaka Chavithi | వినాయక చవితి 2025 .. పండుగ ప్రారంభానికి ముందు పాటించాల్సిన ముఖ్య సూచనలు!
Vinayaka Chavithi | హిందూ సంప్రదాయంలో ప్రతీ మంగళకార్యానికి ముందు వినాయకుడి పూజ తప్పనిసరి. వినాయకుడు – విఘ్నాలను తొలగించే దేవుడు అనే నమ్మకంతో, ఆయన్ని ముందుగా ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. వినాయక చవితి 2025, ఆగస్టు 26 సాయంత్రం నుంచి ప్రారంభమై, ఆగస్టు 27 మధ్యాహ్నంతో ముగియనుంది . అందువల్ల చాలా మంది ఆగస్టు 27న సాయంకాలం వరకు పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఇవి పాటించండి..
వినాయక చవితికి ముందుగా పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే.. పూజ గదిలో పగిలిపోయిన దేవత విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. ఇవి నెగెటివ్ ఎనర్జీకి కారణమవుతాయని సంప్రదాయ నమ్మకం. ఇంట్లో అవసరం లేని, పగిలిపోయిన వస్తువులు లేదా పని చేయని యంత్రాలను తొలగించడం ద్వారా శాంతి ఏర్పడుతుందన్న నమ్మకం ఉంది. వినాయకుని ప్రతిష్ఠకు ముందు పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది, కుటుంబంలో ఆనందం, ఐక్యతకు దారితీస్తుంది.
ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పండుగకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పండుగకు ముందు గణపతి బొమ్మల తయారీ, పూజా సామాగ్రి కొనుగోలు, పూజా మండపాల ఏర్పాటు వంటి పనులు ఊపందుకున్నాయి. పర్యావరణహిత గణేశ్ బొమ్మలవైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.