
young man kills himself after lost in ipl betting in vizag
IPL Betting : కన్నపిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్లకు ఉన్న ఆర్థిక స్థోమత కష్టపడి పిల్లలను బాగా చదివించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగుల్చుతున్నారు పిల్లలు. విశాఖ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడి చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. దీనికి సూత్రధారి ఒక వ్యక్తి అని.. కాలేజీ కుర్రాళ్లను ట్రాప్ చేసి వాళ్లకు డబ్బులు ఇస్తాడట.
18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లను ట్రాప్ చేసి.. వాళ్లకు అప్పులు ఇచ్చి ఐపీఎల్ బెట్టింగ్ లు వేసేలా ప్రోత్సహిస్తాడు అంటున్నారు. ఫార్మసీ కంపెనీలో పని చేసేవాడు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లను చేరదీసి.. వాళ్లకు అప్పు ఇచ్చేవాడు అంటూ.. ఆ పిల్లాడి తండ్రి వెక్కి వెక్కి ఏడ్చాడు.మీకు ఎందుకు.. ఏం కాదు. డబ్బులు తీసుకో.. బెట్టింగ్ వేయ్ అని రెచ్చగొడతారు అంటూ చెప్పుకొచ్చాడు. అటువంటి వాళ్లు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు అని వాళ్లను పట్టుకొని వాళ్లను ట్రాప్ లోకి దించాడు అంటున్నారు.
young man kills himself after lost in ipl betting in vizag
నా కొడుకు ఎలాగూ వెళ్లిపోయాడు. వేరే పిల్లలు కూడా అతడి ట్రాప్ లో పడకండి. తల్లిదండ్రుల మాట వినండి. వాళ్లే మీ సమస్యలను తీర్చుతారు. తల్లిదండ్రులే మీ రక్ష. వాళ్లు మీ కష్టాలన్నీ తీర్చుతారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఇదంతా జరుగుతోందని. నా కొడుకు చనిపోయి.. అందరికీ కనువిప్పు కలిగించాడు. మీరు అంతా ఆ నాయుడి వలలో పడకుండా మీ తల్లిదండ్రుల మాటే వినండి అంటూ ఆ కుర్రాడి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.