YS Avinash Reddy : “సునీతక్కా ఒక్కటి చెప్తున్నా గుర్తు పెట్టుకో” ఎన్నడూ లేనంత ఎమోషనల్ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి..!
YS Avinash Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టం కావడం లేదు. ఓవైపు తానే హత్య చేశానని దస్తగిరి అప్రూవర్ గా మారాడు. కానీ.. సీబీఐ మాత్రం అసలు నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ చార్జ్ షీట్ దాఖలు చేసి ఆయన్ను విచారిస్తోంది. తనను కావాలని వివేకా హత్య కేసులో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా మండిపడ్డారు.
కేసును సాల్వ్ చేయడం పక్కన పెడితే సీబీఐ ఆ కేసులో నన్ను ఇరికించడానికే తెగ ప్రయత్నాలు చేస్తోంది. నాలాంటి ఎంపీ స్థాయి వ్యక్తినే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. సునీత అక్క సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్ మెంట్, తర్వాత ఇచ్చిన స్టేట్ మెంట్.. రెండూ పోల్చి చూస్తే చాలా తేడాలు ఉన్నాయి. అక్క ఇచ్చిన స్టేట్ మెంట్ లో పలు అనుమానాలున్నాయి.. అంటూ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
YS Avinash Reddy : హత్య జరిగిన రోజు నేను జమ్మల మడుగు వెళ్లేందుకు రెడీ అవుతున్నా
హత్య జరిగిన రోజున నేను జమ్మల మడుగుకు వెళ్తున్నా. పులివెందుల రింగ్ రోడ్ కు వెళ్లే సరికి.. నాకు శివప్రకాష్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే వచ్చాను. కానీ.. ఈ కేసులో నేను ఇంట్లో ఉన్నట్టుగా సీబీఐ నన్ను ఇరికిస్తోంది. నాతో పాటు వచ్చిన వారికి విచారించండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అసలు దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆ రోజు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్టు దస్తగిరి చెబితే.. సీబీఐ వాటిపై విచారించలేదు. లెటర్ విషయంలో అలాగే చేశారు. నిజాలు బయటికి రావాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటో మీడియానే చెప్పాలి.. అని అవినాష్ రెడ్డి తెలిపారు.