Ys Bharati : 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీని ఓడించాలనేది టార్గెట్ కాగా అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల మాదిరి పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. ఈ సారి జగన్ ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. ప్రచార బాధ్యతలను తానొక్కడే మోయాల్సి ఉంటుంది. గతంలో అయితే వైసీపీ తరఫున విజయమ్మ , వైఎస్ షర్మిల ప్రచారం చేశారు. ఇక జగన్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. అయితే, ఈ సారి షర్మిల తెలంగాణలోనే ఉండబోతున్నది. విజయమ్మ సైతం ఆమెకు మద్దతుగా అక్కడికే వెళ్లొచ్చు.
ఒకవేళ ఏపీకి వచ్చినా ఒకటి రెండు సభల్లోనే పాల్గొనే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే 175 నియోజకవర్గాల్లో జగన్ ఒక్కడే ప్రచారం చేయలేడు. కాబట్టి జగన్ తనకు మద్దతుగా వైఎస్ భారతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారతి సాక్షి మీడియా సంస్థ చైర్ పర్సన్‌గా , ఇండస్ట్రియలిస్ట్‌గా, గృహిణిగా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించింది. జగన్ సీఎం అయిన నాటి నుంచి తాడేపల్లిలో జగన్ బాగోగులు చూసుకుంటున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని అధినేత యోచిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా భారతి పర్యటించేలా ఏర్పాట్లు చేసి, ఆమె ద్వారా మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అయితే, భారతి ఇంత వరకు పబ్లిక్ మీటింగ్స్‌లో అయితే పాల్గొనలేదు. ఈ క్రమంలోనే పబ్లిక్ మీటింగ్స్‌లో ఎలా మాట్లాడాలనే విషయాలపై శిక్షణ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ భారతి ఏపీ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండబోతుందనే చర్చ ఇప్పటి నుంచి షురూ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.