AP Govt Jobs : ఏపీలో చదువు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. మొదటి విడుతలో ఏపీపీఎస్సీ కింద 269 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో గ్రూప్ -4, నాన్ గెజిటెడ్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆయుర్వేద, హోమియో వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎలా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు తేది, ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొత్తం పోస్టుల సంఖ్య -269 కాగా, గ్రూప్ – 4 సర్వీసెస్‌లో 06 పోస్టులు, ప్రిసన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ 01 + జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 01, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ 01,సెరికల్చర్ (ముడి పట్టు తయారీ) సర్వీస్ లో టైపిస్ట్ 01, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్టెనో/టైపిస్ట్ 01, లేబర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ 01, ఉన్నాయి.
వీటి దరఖాస్తు తేదీ 29.09.2022 గడువుతేది 19.10.2022గా నిర్ణయించారు. ఇక మిగతా పోస్టులకు సంబంధించిన వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా వివరాలు పొందవచ్చును. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ ఎట్టకేలకు శుభవార్త చెప్పడంతో ఈసారి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.