AP Govt Jobs : నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Govt Jobs : నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

 Authored By mallesh | The Telugu News | Updated on :29 September 2022,3:30 pm

AP Govt Jobs : ఏపీలో చదువు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. మొదటి విడుతలో ఏపీపీఎస్సీ కింద 269 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో గ్రూప్ -4, నాన్ గెజిటెడ్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆయుర్వేద, హోమియో వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎలా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు తేది, ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొత్తం పోస్టుల సంఖ్య -269 కాగా, గ్రూప్ – 4 సర్వీసెస్‌లో 06 పోస్టులు, ప్రిసన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ 01 + జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 01, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ 01,సెరికల్చర్ (ముడి పట్టు తయారీ) సర్వీస్ లో టైపిస్ట్  01, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్టెనో/టైపిస్ట్ 01, లేబర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ 01, ఉన్నాయి.

YS Jagan AP Govt Released Group 4 and APPSC Jobs Notification

YS Jagan AP Govt Released Group-4 and APPSC Jobs Notification

వీటి దరఖాస్తు తేదీ 29.09.2022 గడువుతేది 19.10.2022గా నిర్ణయించారు. ఇక మిగతా పోస్టులకు సంబంధించిన వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా వివరాలు పొందవచ్చును. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ ఎట్టకేలకు శుభవార్త చెప్పడంతో ఈసారి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది