ys jagan : రాజధాని తరలింపుపై వ్యూహం మార్చుకున్న వైఎస్ జగన్..?
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని అమరావతి నుండి మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించాలని నిర్ణయించాడు. అందుకు సంబంధించి వెంటనే అసెంబ్లీ బిల్లు తీసుకు వచ్చాడు.. గవర్నర్ తో ముద్ర వేయించాడు. కాని కోర్టులు మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు పడుతూ వస్తున్నాయి. ఏపీలో రాజధాని విషయం ఇప్పట్లో తేలేలా లేదు. కోర్టుల్లో ఉన్న ఈ విషయం ఎప్పటికి తేలేలా లేదు. వచ్చే ఎన్నికల వరకు రాజధాని మారినట్లుగా ప్రజల ఆలోచన రావాలి. అందుకోసం జగన్ కోర్టు కళ్లు కప్పే ప్రయత్నాలు చేస్తున్నాడట.
ys jagan : అనధికారికంగా తరలింపు…
రాజధాని మార్పు అనేది కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందే. కోర్టు తీర్పు రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుంది అనేది క్లారిటీ లేదు. కనుక అనధికారికంగా రాజధానిని తరలించి కోర్టుకు ఇంకా తరలించలేదు అని చెప్పాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడట. వైకాపా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెల్లగా రాజధానిని తరలించేందుకు గాను మొదట సీఎం క్యాంపు కార్యాలయంను వైజాక్ కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టు తీర్పు అనుసారంగా ఇతర రాజధాని తరలింపు కార్యక్రమాలు జరుగుతాయి.
ys jagan : వైజాగ్ నుండి పరిపాలన..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా అనధికారికంగా తాత్కాలికంగా వైజాగ్ లో ఆఫీస్ లను ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా పరిపాలన వైజాగ్ నుండి మొదలు అయ్యిందని ప్రజలు విశ్వసిస్తారు. దానికి తోడు ఇది కోర్టు దిక్కారం కూడా అవ్వదు. అందుకే వైజాగ్ ను రాజధానిగా మార్చుకునే పక్రియను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కోర్టు ఎలాంటి విమర్శలు ప్రభుత్వంను కాని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాని చేయలేదు. అనధికారికంగా చేసింది కనుక కోర్టు స్పందించదు అనేది విశ్లేషకుల వాదన. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.