
jagan suspended mlas joining in Chandrababu tdp in ap
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. సీఎం జగన్ తాజాగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా తమ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం తో పాటు పలు విషయాల గురించి సీఎం జగన్ మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో రైతులు అంతా చాలా సంతోషంగా ఉండే విధంగా రైతు భరోసా పథకంను తీసుకు వచ్చినట్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు.
చంద్రబాబు నాయుడు గతంలో రైతులను పట్టించుకోకుండా వ్యవసాయం దండగా అన్నాడు. ఆయన ఇప్పుడు రైతుల యొక్క సంక్షేమం మరియు వారి యొక్క బాగోగుల గురించి మాట్లాడుతున్నాడు అంటూ జగన్ ఎద్దేవ చేశాడు. గతంలో ఎప్పుడు కూడా రైతుల గురించి పట్టని చంద్రబాబు దత్త పుత్రుడు ఇప్పుడు రైతుల ను పరామర్శించేందుకు అంటూ బయలు జేరాడు. రైతులను పరామర్శించే అవకాశం ఏమీ లేదని.. వారు అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి అందుతున్న పెట్టుబడి సాయం తో పాటు మద్దతు ధర కారణంగా చాలా సంతోషంగా ఉన్నారంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు అప్పుల బాధలతో..
YS Jagan comments on Pawan Kalyan and ChandraBabu naidu
కనీస మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో రైతులు ఈ దత్త పుత్రుడికి కనిపించలేదా… ఆ సమయంలో రైతులు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారని ఆయన అభిప్రాయ పడ్డాడా అంటూ జగన్ ప్రశ్నించాడు. ఎన్నికలు వస్తున్నాయి కనుక తెలుగు దేశం పార్టీని మళ్లీ గెలిపించాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ రైతు యాత్రలు ఇతర యాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏం అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు ఒక్కటే.. వారిద్దరు రాష్ట్రానికి చేసింది లేదు.. చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నది చేయనూ లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.