YS Jagan : అప్పుడేమయ్యాడు ఈ చంద్రబాబు దత్త పుత్రుడు.. వైఎస్ జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : అప్పుడేమయ్యాడు ఈ చంద్రబాబు దత్త పుత్రుడు.. వైఎస్ జగన్

 Authored By prabhas | The Telugu News | Updated on :18 May 2022,3:30 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. సీఎం జగన్ తాజాగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా తమ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం తో పాటు పలు విషయాల గురించి సీఎం జగన్‌ మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో రైతులు అంతా చాలా సంతోషంగా ఉండే విధంగా రైతు భరోసా పథకంను తీసుకు వచ్చినట్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు.

చంద్రబాబు నాయుడు గతంలో రైతులను పట్టించుకోకుండా వ్యవసాయం దండగా అన్నాడు. ఆయన ఇప్పుడు రైతుల యొక్క సంక్షేమం మరియు వారి యొక్క బాగోగుల గురించి మాట్లాడుతున్నాడు అంటూ జగన్ ఎద్దేవ చేశాడు. గతంలో ఎప్పుడు కూడా రైతుల గురించి పట్టని చంద్రబాబు దత్త పుత్రుడు ఇప్పుడు రైతుల ను పరామర్శించేందుకు అంటూ బయలు జేరాడు. రైతులను పరామర్శించే అవకాశం ఏమీ లేదని.. వారు అన్ని విధాలుగా చాలా సంతోషంగా ఉన్నారు. వారికి అందుతున్న పెట్టుబడి సాయం తో పాటు మద్దతు ధర కారణంగా చాలా సంతోషంగా ఉన్నారంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు అప్పుల బాధలతో..

YS Jagan comments on Pawan Kalyan and ChandraBabu naidu

YS Jagan comments on Pawan Kalyan and ChandraBabu naidu

కనీస మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో రైతులు ఈ దత్త పుత్రుడికి కనిపించలేదా… ఆ సమయంలో రైతులు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారని ఆయన అభిప్రాయ పడ్డాడా అంటూ జగన్ ప్రశ్నించాడు. ఎన్నికలు వస్తున్నాయి కనుక తెలుగు దేశం పార్టీని మళ్లీ గెలిపించాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ రైతు యాత్రలు ఇతర యాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏం అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు ఒక్కటే.. వారిద్దరు రాష్ట్రానికి చేసింది లేదు.. చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నది చేయనూ లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది