YS Jagan : వైఎస్ జగన్ దావోస్ పర్యటన, కోనసీమ మంటల మద్య సంబంధం ఉంది తెలుసా?
YS Jagan : కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం అనేది చాలా రోజుల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఇంత హడావుడి ఎందుకు జరుగుతుంది. ఇంతగా కోనసీమ రగిలి పోవడంకు కారనం ఏంటీ అంటే కొందరు కొన్ని రకాలుగా ఊహించుకుంటున్నారు. కాని ఎక్కువ శాతం మంది మాత్రం సీఎం జగన్ దావోస్ పర్యటన కారణంగానే ఏపీలో ఈ అలజడి మొదలయ్యింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ దావోస్ పర్యటనకు ఖచ్చితంగా కోనసీమ మంటలకు రిలేషన్ ఉందంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నాం అంటూ మీడియా ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు.అసలు విషయం ఏంటీ అంటే…
సీఎం జగన్ దావోస్ కు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సమయంలో రాష్ట్రంకు ఆ వేల కోట్ల పెట్టుబడులు వస్తే సీఎంగా జగన్ స్థాయి అమాంతం పెరుగుతుంది అనేది ప్రత్యర్థుల కుట్ర. అలా పెరిగితే ఇప్పుడే కాదు మళ్లీ మళ్లీ కూడా జగన్ సీఎం అవుతాడు. అందుకే ఆ విషయాలను మీడియా ద్వారా ప్రజలకు చేరకూడదు.. అలాగే కోనసీమలో మంటల వల్ల వచ్చే కంపెనీలు.. రావాలనుకున్న కంపెనీలు కూడా వెనక్కు వెళ్లడం ఖాయం.కోనసీమలో శాంతి భద్రతల సమస్యలను చూపించి ఎన్నో కంపెనీలను వెనక్కు పంపించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ది అనేది జరగకుండా పోతుంది.

ys jagan davos tour reason for destruction of konaseema
తద్వారా రాజకీయంగా బలపడాలి అనేది కొందరి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే చిన్న సమస్యను కాస్త పెద్దదిగా చూపించి విపక్ష పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు కోనసీమ మంటలకు పాల్పడుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య తలెత్తింది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ మంటలు రేపుతున్నారు. ఈ సమయంలో మంటలు రేపడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దావోస్ పర్యటన అనేది ఉపయోగం లేకుండా మారుతుంది. అందుకే కోనసీమ మంటలు రేపారనే పుకార్లు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది అత్యన్నత స్థాయి ఎంక్వౌరీ జరిగితే కాని క్లారిటీ రాదు.