ఏపీలో వింత పరిస్థితి : ప్రతిపక్షాలకు సాయం చేస్తున్న జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఏపీలో వింత పరిస్థితి : ప్రతిపక్షాలకు సాయం చేస్తున్న జగన్

 Authored By brahma | The Telugu News | Updated on :2 May 2021,12:43 pm

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రతిపక్షాల విషయంలో చాలా జాగురతతో వ్యవహరిస్తాయి. తమ లోపాలు ఏవి కూడా ప్రతిపక్షాలకు చిక్కకుండా ముందుకు వెళ్తాయి. ఎంత మంచి పాలన అందించిన కానీ ఒకే ఒక్క తప్పుతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడి ఎలాంటి అవకాశం ఇవ్వటానికి ఇష్టపడవు. అయితే ప్రతిపక్షంలో ఉండి, అధికారపక్షంపై ఆరోపణలు చేయకుండా మౌనంగా ఉంటె తమ ఉనికిని కోల్పోతామని భావించే ఆయా పార్టీలు ఎదో ఒక వంక పెట్టుకొని అధికార పక్షం మీద దుమ్మెత్తిపోస్తుంటాయి.

ys jagan helping the opposition party

ys jagan helping the opposition party

అయితే ఆంధ్రాలో పరిస్థితి అందుకు బిన్నంగా కనిపిస్తుంది. సీఎం YS Jagan తీసుకునే అనేక నిర్ణయాలను ప్రతిపక్షము టీడీపీ ముందు విమర్శించినా కానీ తర్వాత వాటికీ అనుకోకుండా మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే,, మొదట దానిని టీడీపీ తీవ్రంగా విమర్శించింది. కానీ కొన్ని రోజులకు అదే తెలుగుదేశం పార్టీ నేతలు వాలంటీర్లు లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీని బట్టి చూస్తే ఏపీ ప్రతిపక్షము ఎలా ఉందొ అర్ధం అవుతుంది.

అయితే ఇక్కడే జగన్ తన జాలి హృదయం చూపించాలని అనుకున్నాడో ఏమో కానీ, ప్రతిసారి ప్రతిపక్షాలు తమ మీద ఎటాక్ చేయటానికి ఎదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటున్నాడు. తాజాగా ఇంటర్ మరియు 10 వ తరగతి పరీక్షల విషయంలో ప్రతిపక్షాల చేతికి పెద్ద ఆయుధమే ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా పరీక్షలు నిర్వహించటం మంచిది కాదని ఎవరెన్ని చెప్పిన కానీ సీఎం జగన్ మొండిగా ముందుకు వెళ్తున్నాడు.

ఇప్పుడు దీనినే ప్రతిపక్షము గట్టిగా పట్టుకొని నిలదీస్తుంది. పిల్లల భవిష్యత్ విషయంలో రాజకీయ పట్టింపులు వద్దని, వెంటనే పరీక్షలు రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి. సాధారణ ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం కలుగుతుంది. తాము ఓటు వేసి గెలిపించిన తమ నేత ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవేమి జగన్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ప్రతిపక్షాలకు మంచి అవకాశం ఇస్తున్నాడు..

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది