Ys Jagan : ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను జగన్ ఇలా పోగొట్టబోతున్నారన్నమాట..!
Ys Jagan : రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీనేతలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరిపిన జగన్ అండ్ కో.. పీకే టీం రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఎన్నికల యుద్దాన్ని ప్రకటించనుంది. దీంతో వైసీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దిగనున్నారని టాక్. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేశారని తెలుస్తోంది. ఇన్నిరోజులు జనాలకు దూరంగా ఉన్న ప్రజాప్రతినిధులు అంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు.
తాము ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను జగన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులకు అందేలా జగన్ రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. వారానికి 2 రోజుల పాటు తప్పనిసరిగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉండి గ్రామ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ సచివాలయాలను విజిట్ చేస్తానని ప్రకటించారు.అయితే, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినా పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అన్ని పనులను, సమస్యలను వాలంటీర్లే అడిగి మరి తీరుస్తున్నారు.
Ys Jagan : ప్రజల్లోనే ఉండాలి.. ఎక్కడికి వెళ్లొద్దు..
దీంతో ఎమ్మెల్యేలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రజల వద్దకు వెళ్లి మీకు ఏమైనా బాధలు ఉన్నాయా అని ప్రజాప్రతినిధులు అడిగినా స్పందన కరువైందట.. దీంతో ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యవస్థపై మండిపడుతున్నారట.. ఇది జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఎవరూ ఏమీ అనలేకపోతున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకే జగన్ వారానికో కార్యక్రమం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వారంలో 5 రోజులు వారు నియోజకవర్గంలో జనాలకు అందుబాటులో ఉంటే వారిపై ఉన్న వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని సీఎం జగన్ భావించారని తెలిసంది. అందుకోసమే వారికి ఈ టాస్క్‌లను అప్పగించారని టాక్ నడుస్తోంది.