ys jagan mohan reddy cabinet expansion
ys jagan mohan reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan mohan reddy మరోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రత్యేక ఏపీలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఒకే సారి అవకాశం ఇచ్చారు. కాని జగన్ మాత్రం తనకు మరో సారి ప్రజలు అవకాశం ఇచ్చేలా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు. తనపై ఉన్న ఆరోపణలు తూడ్చిపెట్టుకు పోయేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలుకుని తన పార్టీ నాయకులు కింది స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వైపు టీడీపీని బలహీన పర్చుతూనే మరో వైపు తన పార్టీకి బలం పెంచే విధంగా జగన్ ఒక పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు త్వరలో ముహూర్తం పెట్టబోతున్నాడు. సీఎం జగన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ తన మంత్రి వర్గంలోకి కొత్త వారిని తీసుకునేందుకు గాను ఆలోచనల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపుగా ఆరుగురు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. దాంతో వారిని మంత్రి వర్గం నుండి తప్పించేందుకు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఇక కొత్త వారికి ఎవరికి అవకాశం కల్పించాలనే విషయమై వచ్చే ఎన్నికలే ప్రధాన టార్గెట్ గా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నాడు.
ys jagan mohan reddy cabinet expansion
ఎమ్మెల్యేల్లో కొందరు ప్రజల్లో మంచి పేరు దక్కించుకున్నారు. తమ పరిధిలో ఉన్న నిధులతో నియోజక వర్గంను అభివృద్ది చేసుకోవడంతో పాటు కింది స్థాయి వైకాపా నాయకులను అవసరంకు ఆదుకోవడం మొదలుకుని వారి కోసం ఏం చేసేందుకు అయినా సిద్దపడటం వంటి కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖరారు చేసుకున్నారు. అందుకే అలాంటి వారికి మంత్రి పదవి ఇస్తే మరింతగా తమ పరిపాలన అందించి ప్రజల్లో నమ్మకం కలిగిస్తారని అందుకే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడు. 2024 లో రాబోతున్న ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నాడు. ఇంకా మూడు ఏళ్లు ఉండగానే జగన్ ys jagan mohan reddy ప్రయత్నాలు చూసి టీడీపీ గుండెలు జారుతూ ఉన్నాలంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.