
#image_title
YS Jagan | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
#image_title
ప్రమాదం ఎలా జరిగింది..
ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే, జగన్ పర్యటన దారిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట సెంటర్ వద్ద మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పామర్రు నియోజకవర్గంలోని గోపువానిపాలెం, ఆకునూరు సెంటర్ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, వృద్ధులు చేరి జగన్‌ను అభినందించారు. కల్లుగీత కార్మికులు జగన్‌ను కలసి తమ సమస్యలను వివరించారు.
ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెం ప్రాంతాల్లోనే పర్యటన కొనసాగించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై నిషేధం విధించగా, మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేశారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.