YS Jagan : గుడ్ న్యూస్ చెప్పి న ఏపీ స‌ర్కార్.. రోజంతా 5షోలకు పర్మిషన్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : గుడ్ న్యూస్ చెప్పి న ఏపీ స‌ర్కార్.. రోజంతా 5షోలకు పర్మిషన్..

 Authored By sandeep | The Telugu News | Updated on :10 February 2022,3:32 pm

YS Jagan : ఆంధ్ర ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి ఎండ్ కార్డ్ పడేల టాలీవుడ్ కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నిస్తుంది. గురువారం చిరంజీవి, నాగార్జున స‌హా ప్ర‌భాస్‌, మ‌హేష్,ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ స‌హా కొంత మంది సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌ల‌వ‌బోతున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్స్ ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డానికి ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురితో రెండు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిపి ఓ నివేదిక‌ను త‌యారు చేసింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ ని క‌లిసారు.పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి. జగన్‌తో మీటింగ్ తర్వాత సినీ పెద్దలు, మంత్రి వెల్లడించిన అభిప్రాయాలతో ఇదే సారాంశం కనిపిస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమ బతకడానికి ప్రభుత్వం సహకరించాలి. ఆ సహకారం ఎన్ని రకాలుగా ఉండాలన్నదానిపై మొత్తం 17 రకాల అజెండాతో సినీ ప్రముఖులు వెళ్లారు. దానిపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వం కూడా సినీ ప్రముఖుల ముందు కొన్ని కోరికలు ఉంచింది. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టాలి. విశాఖ సహా అవకాశం ఉన్న చోట్ల ఏపీలో షూటింగ్‌లు ఎక్కువగా జరగాలి. అందుకు సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించారు.ఇప్పటి వరకూ 5రూపాయలు టికెట్‌ ఉన్న నాన్‌ఏసీ థియేటర్‌లో ఇకపై మినిమమ్‌ 30 రూపాయలు, అత్యధికంగా 70 రూపాయలు ఉండేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

YS Jagan on telling good news Permission for 5 shows

YS Jagan on telling good news Permission for 5 shows

YS Jagan : జ‌గ‌న్ కీల‌క నిర్ణయం…

ఇక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా,కార్పొరేషన్ అయినా.. మినిమమ్‌ టికెట్ రేట్ 40, మ్యాగ్జిమమ్ 150 రూపాయల వరకూ ఆస్కారం ఉండబోతోంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్ ఉంది. ఏపీలో సినీ పరిశ్రమ పెడితే ఎలాంటి ప్రోత్సహకాలు కావాలో సినీ ప్రముఖులు అడిగారు. సీఎం జగన్‌ వైపు నుంచి కూడా పరిశ్రమకు తగ్గ రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాన్న సానుకూలత కనిపించింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం నుండి పలు స‌ల‌హలు అందిన‌ట్టు తెలుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది