Home » Andhra Pradesh » Ys Jagan Sajjala Ramakrishna Reddy Comments About Women Empowerment
andhra pradesh

Ys Jagan : వైయస్ జగన్ మాకు దేవుడు ఇచ్చిన అన్న

Authored By
Himanshi
The Telugu News | Published on: March 8, 2022, 7:40 am
Advertisement

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళా సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకు వచ్చారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ తెలియజేశారు. ప్రతి ఆడపడుచు కూడా వైయస్ జగన్ గారిని తమ సోదరునిగా భావిస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్నామని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

Advertisement

మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కూడా గత ప్రభుత్వం కు లేదని అన్నారు. ఏపీలో మహిళలకు అన్ని రకాలుగా వసతులను కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్నది జగన్ ప్రభుత్వం అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను నమ్మించి మోసం చేయగా ఈ సారి ప్రభుత్వం మాత్రం వారికి అండదండగా ఉంటూ పలు విషయాలలో వారికి మనో ధైర్యం గా నిలుస్తూ వారి విజయం వెనక ఉంటుందని అన్నారు.రాష్ట్రంలో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

Ys Jagan sajjala ramakrishna reddy comments about women empowerment

Advertisement

వైయస్ జగన్ రాష్ట్రంలో అక్క చెల్లి సామాజిక భద్రత మరి ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలను మరియు పథకాలను తీసుకు వచ్చారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఎన్నో పథకాలు ఉన్నాయని వారందరి కోసం జగన్ అన్న గా నిలిచేందుకు ఎప్పుడూ ఉంటాడు అని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా జగన్ మాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని సజ్జల రామకృష్ణ తెలియజేశారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి