Home » Exclusive » Viral Video Lemur Stroll On The Turtle
Exclusive

Viral Video : తాబేలు మీద షికారు.. ఎంజాయ్ చేస్తున్న లెమర్

Authored By
mallesh
The Telugu News | Published on: March 8, 2022, 8:20 am
Advertisement

Viral video : మనుషులు ఎంజాయ్ చేసినట్టుగానే జంతువులు సైతం తమ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని జంతువులైతే మరి ఎక్కువ బద్దకాన్ని చూపుతాయి. అవి చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పించినా.. మరి కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని జంతువులు తమ పని తాము చేసుకుంటుంటే వేరే జంతువులు ఆ పనిని చెడగొడుతుంటాయి. మరి కొన్ని జంతువులు ఎదటి జంతువులపై ఆధారపడతాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే చాలా చూశాం.

Advertisement

ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫన్నీగా కామెంట్స్ సైతం చేస్తున్నారు.తాబేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి హడావుడి లేని జీవి. నెమ్మదిగా కదులుతూ తన పని తాను చేసుకుంటుంది. ఇలా ఒక తాబేలు ఇసుకలో నుంచి వెళ్తుండగా దానిపై ఒక లెమర్ కూర్చుండి. అటూ ఇటూ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది.

Viral Video lemur stroll on the turtle

Advertisement

Viral video : తాబేలుపై కూర్చుని ఎంజాయ్ చేస్తూ..

పాపం తాబేలు మాత్రం దానిని మోసుకుంటూ ముందుకు పోతూనే ఉంది. దీంతో తాబేలు ఓపికను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక లెమర్‌ను మాత్రం భలే ఐడియా నీది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో లెమర్ ఎక్స్‌ప్రెషన్స్ భలేగా ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి