Ys Jagan : బ్రేకింగ్.. కాసేపట్లో హైదరాబాద్ కు సిఎం జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : బ్రేకింగ్.. కాసేపట్లో హైదరాబాద్ కు సిఎం జగన్

Ys Jagan : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నిన్న సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2022,11:20 am

Ys Jagan : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నిన్న సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి కుటుంబం తో సన్నిహితంగా ఉండే సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

CM Jagan to Hyderabad

Ys Jagan to Hyderabad

మేకపాటి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళుతున్నారు. ఇప్పటికే వైయస్ షర్మిల అపోలో ఆసుపత్రికి వెళ్లి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది