Home » Andhra Pradesh » Ys Jagan To Hyderabad
andhra pradesh

Ys Jagan : బ్రేకింగ్.. కాసేపట్లో హైదరాబాద్ కు సిఎం జగన్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 21, 2022, 11:20 am
Advertisement

Ys Jagan : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నిన్న సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి కుటుంబం తో సన్నిహితంగా ఉండే సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Ys Jagan to Hyderabad

Advertisement

మేకపాటి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళుతున్నారు. ఇప్పటికే వైయస్ షర్మిల అపోలో ఆసుపత్రికి వెళ్లి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి