YS Jagan : మళ్లీ జగన్ కే ఏపీ ప్రజలు జై కొట్టారు.. బల్ల గుద్ది మరీ చెబుతున్న ఇండియా టుడే సర్వే
YS Jagan : ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ఎలా? మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలా? ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని తొలుస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచేది వైసీపీ పార్టీనే అని బల్ల గుద్ది మరీ చెప్పింది ఇండియా టుడే సర్వే. అవును.. సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వేను ఇండియా టుడే తాజాగా నిర్వహించింది.
ఈ సర్వే ద్వారా ఇప్పుడు ఎన్నికలు జరిగినా 25 ఎంపీ స్థానాల్లో వైసీపీకి 18 స్థానాలు వస్తాయట. ఇక.. టీడీపీకి ఏడు స్థానాలు రానున్నాయట. ఆగస్టు ఏడిషన్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ లో భాగంగా ఏపీలో ఈ సర్వేను నిర్వహించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. గత నెలలో అంటే జులైలో కూడా ఇండియా టీవీ సర్వే నిర్వహించింది.
YS Jagan : అప్పుడు వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు అని చెప్పిన సర్వే
జులైలో నిర్వహించిన సర్వే ప్రకారం.. వైసీపీకి 19 స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ వెల్లడించింది. అయితే.. ఎమ్మెల్యే స్థానాల్లో ఇండియా టీవీ సర్వేలో 133 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడి కాగా.. ఇండియా టుడే సర్వే ప్రకారం.. వైసీపీకి 126 స్థానాలు వస్తాయని తేలింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయం అని తేలడంతో వైసీపీ శ్రేణులు ఆనందాలకు అవధులు లేవు.
వేర్వేరు సంస్థలు చేసిన సర్వేలోనూ వైసీపీదే విజయం అని తేలడంతో వైసీపీకి టెన్షన్ కాస్తయినా తగ్గినట్టయింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఇండియా టుడే సర్వే నిర్వహించింది. తెలంగాణలో సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కు 8 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ కు 3 స్థానాలు వస్తాయట. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు 54 స్థానాలు వస్తాయని సర్వే తేల్చి చెప్పింది.