YS Sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. నిజమా? అబద్ధమా? ఫుల్లు క్లారిటీ ఇచ్చేసిన షర్మిల?
ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టాక.. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన చెల్లెలు షర్మిల. తర్వాత ఏమైందో కానీ.. తను పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. ఏదో ఫ్యామిలీ విషయాల్లో మాత్రమే కనిపిస్తున్నారు కానీ.. వైసీపీ పార్టీ విషయాల్లో షర్మిల జోక్యం చేసుకోవడం లేదు. ఆ తర్వాత 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. అంతా ఫుల్లు బిజీ అయిపోయారు. షర్మిలను కూడా మరిచిపోయారు.
కానీ.. తాజాగా వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఇన్నిరోజులు అసలు మీడియా ముందుకు రాలేదు.. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అసలు పార్టీ గురించే పట్టించుకోవడం లేదు.. పోనీ తన అన్న ముఖ్యమంత్రి అయ్యాకనన్నా ఏమైనా జోక్యం చేసుకుంటున్నారా? అంటే అదీ లేదు. అయినా కూడా ఇంత సడెన్ గా ఎందుకు మళ్లీ షర్మిల చర్చనీయాంశం అయ్యారు అంతే దానికి కారణం ఒకే ఒక విషయం. అది… వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది.
నిజానికి చాలా రోజుల నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తాజాగా.. ఓ పత్రికలో ఆ వార్తను ప్రచురితం చేశారు. తెలంగాణలో జగన్ చెల్లెలు షర్మిల ఓ పార్టీ పెట్టబోతున్నారంటూ ఆ పత్రిక కథనాన్ని వడ్డించింది. ఆ కథనం చివరకు షర్మిల దగ్గరకు వెళ్లడంతో వెంటనే ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు షర్మిల.
అది ఒక నీతిమాలిన చర్య : షర్మిల
ఈ ఆదివారం రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన ఒక కథనం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా.. ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి చెందిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ ల మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నాను.. అంటూ ఆమె పత్రికా ప్రకటనను విడుదల చేశారు.