
ys sharmila new look for khammam meeting
YS Sharmila : వైఎస్ షర్మిల… ప్రస్తుతం తెలంగాణలో ఈమె హాట్ టాపిక్. అసలు.. ఎప్పుడూ లేనంతగా… వైఎస్ షర్మిల గురించి తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు షర్మిల. అసలు.. షర్మిల ఏంటి? తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటి? అని అంతా ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకున్నారు. కానీ… తను నిజంగానే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో తెలంగాణ ప్రజలు కూడా ఆమెను స్వాగతించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా… అందుకోసమే పార్టీ పెడుతున్నా… అని షర్మిల లోటస్ పాండ్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి.. వైఎస్సార్ అభిమానులతో, ఇంకా ఇతర నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలపై, పార్టీ పేరు, పార్టీ చేయబోయే కార్యక్రమాలపై ఆమె అందరితో చర్చించారు.
ys sharmila new look for khammam meeting
చివరకు ఎప్రిల్ 9న అంటే ఈరోజు ఆమె ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి… అక్కడ పార్టీ పేరు, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో షర్మిల సభ జరగనుంది. సభ కోసం షర్మిల ఇవాళ ఉదయమే రెడీ అయి కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఉదయమే తన భర్త అనీల్ కుమార్ ఆశీస్సులను షర్మిల తీసుకున్నారు.
ఈసందర్భంగా బ్రదర్ అనీల్ కుమార్… ట్విట్టర్ లో వైఎస్ షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన జీవితంలో సరికొత్త చాప్టర్ మొదలు కాబోతుంది. వెళ్లు… మార్పు కోసం పోరాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చు.. అంటూ షర్మిలను ఉద్దేశించి అనీల్ కుమార్ ట్వీట్ చేయడంతో పాటు… తనతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్రదర్ అనీల్ కుమార్ ట్వీట్ పై షర్మిల కూడా స్పందించారు. నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచేందుకు… ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు నేను నా జీవితంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నా. నా ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ నాతో ఉంటూ.. నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న మీకు ధన్యవాదాలు. ఇది మనకే కాదు… తెలంగాణ ప్రజలకు కూడా సరికొత్త ఆరంభం… అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.