ys sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే దాదాపుగా క్లారిటీ వచ్చింది. గత ఆరు నెలలుగా ఆమె బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఆమె ఒక్క రోజు రెండు రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో విషయాల గురించి ఆలోచించి, వందల మందితో సంప్రదింపులు జరిపి పలు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి తెలంగాణలో తన బలం ఏంటీ అనేది సర్వే చేయించుకుని ఇంకా రాజన్న అభిమానులు ఉన్నారా అనేది తెలుసుకున్న తర్వాతే షర్మిల రంగంలోకి దిగాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరి మాట.
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా షర్మిల పార్టీ పెట్టబోతుంది కదా ఆమె పార్టీ వల్ల ఎవరికి ఎంత నష్టం అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎక్కువగా కాంగ్రెస్ కు నష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇంకా కూడా రాజన్న అభిమానులు ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కొందరు ఆయనతో వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. టీఆర్‌ఎస్ ముందు పిల్లిగంతులు వేస్తుంది. ఇలాంటి సమయంలో షర్మిల పెట్టబోతున్న రాజన్న కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని వారు నమ్ముతున్నారు. అందుకే షర్మిల వైపు దూకే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి కూడా టీఆర్‌ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లతో కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంది అంటున్నారు.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ విషయం సీఎం కేసీఆర్ కు ముందే తెలుసా అన్నట్లుగా ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. ప్రాంతీయ పార్టీలు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. కనుక కొత్తగా వచ్చే పార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా కేసీఆర్ కామెంట్ లు విసిరాడు. ఇంకా షర్మిల పార్టీ ప్రకటించకుండానే కేసీఆర్ స్పందించడం అంటే ఖచ్చితంగా కాస్త ఆలోచనలో అయితే ఉన్నట్లే అన్నట్లుగా రాజకీయ వర్గాల వారు అంటున్నారు. అంటే షర్మిల పార్టీ విషయంలో కేసీఆర్ కూడా కాస్త కంగారు పడుతున్నాడేమో అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అధికార టీఆర్‌ఎస్ నుండి మొదలుకుని కాంగ్రెస్ బీజేపీలను కూడా రాజన్న కాంగ్రెస్ భయపెడుతుంది. షర్మిల పేరుతో పార్టీ వస్తే పెద్దగా భయం లేదు కాని రాష్ట్రంలో ఇంకా రాజశేఖర్ రెడ్డి కి సానుభూతిపరులు ఉన్నారు. కనుక ఆయన పేరుతో వస్తే ఖచ్చితంగా భయపాల్సిందే అనుకుంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.