YS Sharmila : కేటీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ వైఎస్ షర్మిల.. మరో ట్వీట్ తో షర్మిల కౌంటర్?
YS Sharmila : వైఎస్ షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత దూకుడు మీదున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సమయం దొరికతే చాలు.. వెంటనే సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ట్వీట్లతో షర్మిల తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. శనివారం.. జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని ఇవ్వాలని.. విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చే మనసును ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను.. మీ బాధ్యతను గుర్తు చేస్తూ ఓ వీడియో కానుక అంటూ ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న వీడియోను షర్మిల పోస్ట్ చేశారు.
54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని,
విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నాను.
మీ భాద్యతను గుర్తుచేసె చిన్న విడియో కానుకhttps://t.co/HVjB5OKzQR— YS Sharmila (@realyssharmila) July 24, 2021
YS Sharmila : షర్మిల ట్వీట్ పై… కేటీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
అయితే.. షర్మిల ట్వీట్ పై కేటీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. షర్మిలకు కౌంటర్లు ఇచ్చారు. కేటీఆర్ మద్దతుదారులు ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఆ ట్వీట్ నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ ట్వీట్ పై షర్మిల మళ్లీ ఇంకో ట్వీట్ చేశారు.
నేను ఉద్యోగాలు ఇవ్వాలంటూ కోరాను. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమంటూ కోరాను.. తప్పితే నేనేమీ లేనిది అడగలేదు.. దానికి నాపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. మా పోరాటం గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకులు ఆత్మహత్యలు ఆపడమే. చిన్న దొరగారు ఆడవాళ్లు వత్రాలు చేసుకోవాలి అని అన్నప్పుడు నిద్ర నటిస్తూ.. నిన్నటి పుట్టిన రోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లచి.. నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు కేటీఆర్ గురి సైన్యానికి ధన్యవాదాలు. మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచారు. మా కన్నా మేము ఎంచుకున్న పోరాటం చాలా గొప్పది. మీరు మమ్మల్ని అణిచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరు సాగుతూనే ఉంటుంది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తు చేస్తూనే ఉంటాం.. అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అలాగే.. ఆత్మహత్య చేసుకున్న ఆ యువకుడు శ్రీకాంత్.. గతంలో పాడిన ఓ పాట వీడియోను కూడా షర్మిల పోస్ట్ చేసి.. కేటీఆర్ సైన్యానికి ఘాటు రిప్లయి ఇచ్చారు.
మా పోరాటం గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకుల ఆత్మహత్యలు ఆపడమే.
చిన్న దొరగారు ఆడవాళ్లు వ్రతాలె చేసుకొవాలె అన్నప్పుడు నిద్రనటిస్తూ నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచి నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు KTR గారి సైన్యానికి ధన్యవాదాలు. 2/1 pic.twitter.com/vCBBVtVp8j— YS Sharmila (@realyssharmila) July 25, 2021