YSR Cheyutha Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. కండిషన్స్ అప్లై!
YSR Cheyutha Scheme : జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 45 ఏళ్లు నిండిన వారు వైఎస్సార్ చేయూత పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
YSR Cheyutha Scheme : సంక్షేమానికే పెద్దపీట..
ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను సమయానికి అమలు చేస్తున్నారు. టంచనుగా చెప్పిన టైంకు పడిపోతున్నాయి. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసి రాబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధికారంలోకి రావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 45ఏళ్లు నిండి అర్హులైన మహిళలు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.సెప్టెంబర్ 5వ తేదీ వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45-60 ఏళ్ల మధ్య వయసు ఉండే అర్హుతలకు రాష్ట్రప్రభుత్వం ఈ పథకం పేరిట ఏడాదికి రూ.18750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందజేయాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 5 వరకు ఈ పథకానికి అర్హులు అయ్యేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 8వ తేది లోపు సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు.అదేవిధంగా కొత్తగా పేర్ల నమోదుకు కుల ధ్రువీకరణ,ఆదాయ ధ్రువీకరణ,ఆధార్ కార్డు తప్పనిసరిగా జతపరచాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 3వ విడతలో సెప్టెంబర్ మాసంలోనే లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున ప్రభుత్వం వారి అకౌంట్లలో డబ్బును జమ చేస్తుందని తెలుస్తోంది.