Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశ్యం లేదు.. చంద్రబాబునే సీఎం క్యాండిడేట్
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్య మంత్రిగా చేయడమే జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశమని.. ఆ ఉద్దేశంతోనే ఆయన పార్టీ పెట్టాడు అంటూ వైకాపా ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ మొదటి సారి తాను పోటీ చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం లో కీలక పాత్ర పోషించాడు. తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేసి వైకాపా అధికారంలోకి రాకుండా చూడాలని ప్రయత్నించాడు.
కానీ ఆ సమయంలో వైకాపా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వైకాపా ముఖ్య నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏదైనా సేవ చేయాలని కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని మాత్రమే పని చేస్తున్నారంటూ ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ వైకాపా నాయకులు ఆరోపించారు తెలుగు దేశం పార్టీ కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్కళ్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఆయనకు కాకుండా ముందు ముందు చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఓట్లు వేయాలని.. ఆయన దేవుడు అంటూ పూజిస్తాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. జన సైనికులు ఇప్పటికైనా మేల్కొని పవన్ కళ్యాణ్ తీరుని అర్థం చేసుకోవాలి అంటూ వైకాపా నాయకులు సూచిస్తున్నారు.