ex minister paleti ramarao not leaving ysrcp
YSRCP MLAs ex mps : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారా అంటే అవును అని కొందరు రాజకీయ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. వైకాపా కు చెందిన రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీలు ఆదిపత్యం కనబర్చే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగానే బీజేపీలో జాయిన్ అవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు కొందరు భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుండి సన్నిహితుల ద్వారా బీజేపీ నాయకులతో చర్చలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ స్థానం ఇవ్వడంతో పాటు అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట.
వైకాపాలో వర్గ పోరు కనిపిస్తుంది. జిల్లాల్లో రెండు మూడు వర్గాలు ఉన్న కారణంగా పెద్ద ఎత్తున నాయకులు అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వర్గ పోరు విషయంలో చూసి చూడనట్లుగా ఉంటున్న కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సందర్బంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గ పోరు కారణంగానే ఒక మాజీ ఎంపీ త్వరలోనే బీజేపీలో జాయిన్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేస్తానంటూ సన్నిహితులతో అంటున్నాడట. గత కొన్నాళ్లుగా ఆయన పార్టీకి కాస్త దూరం ఉంటూ వస్తున్నాడు. దాంతో ఆయన బీజేపీ కి దగ్గర అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
YSRCP MLAs ex mp and leaders are going to join in BJP
రెడ్డి వర్గంకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లోకి వెళ్లారు అంటూ వస్తున్న వార్తలు ఆ పార్టీ నాయకులను కలవర పెడుతోంది. ప్రభుత్వం పరంగా వైఎస్ జగన్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. కాని అధికార పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లారు అంటే ఖచ్చితంగా పరువు తక్కువ విషయం. అందుకే ఈ విషయమై కాస్త సీరియస్ గానే ఆలోచన చేయాలని ఈ సందర్బంగా పార్టీ నాయకులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. అయినా ఇంటిలిజెన్స్ ను ఎక్కువగా ఉపయోగించుకునే వైఎస్ జగన్ కు ఆ ఎమ్మెల్యేల గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.