YS Jagan : జగన్ వ్యూహం : బడ్జెట్ లో కేటాయింపులు లేక పోవడంతో నిమ్మగడ్డపై వైకాపా నాయకుల మాటల యుద్దం
YS Jagan : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2021-22 బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సారి మాదిరిగానే ఈ సారి కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోకుండా వదిలేశారు. బడ్జెట్ లో ఏపీకి కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో జనాలు ముఖ్యంగా మేధావులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత మంది ఎంపీల బలం ఉండటంతో పాటు కేంద్రంలో అంతా ఇంతా అంటూ చెప్పుకునే జగన్ ఎందుకు కేటాయింపుల విషయంలో కేంద్రంతో పోరాటం చేయలేక పోతున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి అన్యాయం అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రాకుండా ఉండేందుకు వైకాపా దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లే కనీసం బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పి కొట్టడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ఆ దృష్టిని మరల్చే విధంగా పంచాయితీ ఎన్నికల మీదకు మీడియా దృష్టి మరల్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ పై వైకాపా నాయకులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆయన్ను తీవ్రంగా తప్పుబడట్టడంతో పాటు ఏదో ఒక విషయంలో ఆయన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్న వైకాపా నాయకులు కొత్త ఎత్తుగడలతో నిమ్మగడ్డ విషయం మళ్లీ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని అందుకే కేంద్రం కేటాయింపుల విషయంలో నిరాశ మిగిల్చికుందని విమర్శలు వస్తున్నాయి. అందుకే నిమ్మగడ్డ విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చిన తర్వాత బడ్జెట్ గురించి జనాల్లో చర్చ ఉండదని అందుకే వైకాపా నాయకులను ఆ దిశగా ప్లాన్ చేయమంటూ వైఎస్ జగన్ మోహన్ ఆదేశాలు జారీ చేశారట. మొత్తానికి కేంద్రంతో గొడవ పడకుండా రాష్ట్రంలో పరువు పోగొట్టుకోకుండా వైఎస్ జగన్ మోహన్ పన్నిన వ్యూహం సూపర్ అంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.