జగన్ ఏం చేశాడు బొక్క.. చేతులెత్తేశాడు.. వామ్మో… వైసీపీ సీనియర్ నేతల వీడియో లీక్‌..!

0
Advertisement

ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం రాత్రి పూట కర్ఫ్యూతో పాటు పగటి పూట కర్ఫ్యూను కూడా ప్రభుత్వం విధించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులు తెరవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటితే షాపులు తీయడానికి వీలు లేదు. 12 నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని షాపులు, ప్రజా రవాణా అన్నీ బంద్.

ycp senior leaders on ys jagan over corona situation in ap
ycp senior leaders on ys jagan over corona situation in ap

ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల వీడియో. వాళ్లు సరదాగా ఒక చోట కూర్చొని ముచ్చటించుకుంటున్న వీడియో అది. వాళ్లు ఏదో ఒక దాని గురించి మాట్లాడితే మనం ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఎందుకంటే.. వాళ్లు మాట్లాడింది వాళ్ల పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి.

కరోనా విషయంలో సీఎం జగన్ ఏం చేయలేదని.. ఆయన ఏం చేశాడు బొక్క.. ఆయన చేతులెత్తేశాడని వైసీపీ సీనియర్ నేతలు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. అసలు.. ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసిందని ఒకరు అంటే.. అసలు ఎవరైనా చనిపోతే పేద కుటుంబాలు అయితే డొనేషన్స్ కోసం అడుక్కుంటున్నారని మరొకరు.. ఇలా.. కరోనా విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందంటూ అదే పార్టీకి చెందిన సీనియర్ నేతలు చర్చించడం.. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కేసుల పెరుగుతుంటే.. జగన్ చేతులెత్తేస్తారా?

ఓవైపు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జగన్ మాత్రం చేతులెత్తేశారు. ఆయన చేసేదేం లేదు బొక్క. వారం తర్వాత చెప్తా అన్నారు. రోజూ కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఎవరైనా పోతే పేద కుటుంబాలు డొనేషన్స్ కోసం పోతాయి.. అంటూ వైసీపీ సీనియర్ నేతలు చర్చించిన వీడియోను మీరు కూడా చూడండి.

Advertisement