
ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
YSRCP : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతోంది.? అన్నదానిపై ఇప్పటినుంచే బోల్డన్ని సర్వేలు జరుగుతున్నాయి. నిజానికి, ప్రతి యేడాదీ, ఆ మాటకొస్తే ఆర్నెళ్ళకోసారి సర్వేలు చేస్తుంటారు కొందరు. అధికారంలో వున్న పార్టీలూ, విపక్షాలూ.. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం కొత్తేమీ కాదు. ఆయా సర్వేలకు అనుగుణంగా ఆయా పార్టీలు తమ వ్యూహాల్ని మార్చుకుంటుంటాయి. వీటి కోసం బోల్డన్ని ప్రైవేటు సంస్థలు అందుబాటులో వున్నాయి… అవి సర్వేలు చేస్తుంటాయి.. ఆయా పార్టీలకు నివేదికల్ని ఇస్తుంటాయి. గత కొద్ది రోజులుగా ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే’ అన్న కోణంలో పలు సర్వేలు జరగడం, వాటి తాలూకు నివేదికలంటూ కొన్ని లెక్కలు ప్రచారంలోకి రావడం తెలిసిన సంగతులే.
అలా వెలుగులోకి వస్తున్న ఓ సర్వే చెబుతున్నదాన్ని బట్టి, వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే సీట్ల సంఖ్య 155 అట. టీడీపీ 20 సీట్లకే పరిమితమవుతుందట.లోక్‌సభ సీట్ల విషయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనీ, టీడీపీకి గుండు సున్నానే మిగులుతందనీ, బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు రావనీ, జనసేన కొన్ని చోట్ల డిపాజిట్లు తెచ్చుకోవడంతోనే సరిపెడుతుందనీ.. ఓ సర్వే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈ సర్వేని నమ్మేందుకు విపక్షాలు సిద్ధంగా లేవు. అధికార పార్టీ కూడా మా లెక్క 170 ప్లస్సు.. అంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు.
YSRCP To Win 155 Seats In 2024!
కాకపోతే, అన్ని రాజకీయ పార్టీలూ ఈ సర్వేలను పరిగణనలోకి తీసుకుని, గ్రౌండ్ లెవల్‌లో తమ తమ పార్టీలకు సంబంధించిన పరిస్థితుల్ని అంచనా వేసుకుంటాయేమో.! రాష్ట్రంలో గడచిన మూడేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికలలోనూ (స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు) వైసీసీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొనసాగిస్తూనే వుంది. అసలంటూ అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా కనిపించడంలేదు. ఇది చాలు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 151 ప్లస్ సీట్లు వస్తాయని చెప్పడానికి. సో, 155 సీట్లు అనేది కాస్త నమ్మదగ్గ సర్వే ఫలితం లాగానే కనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. కానీ, విపక్షాలు అయితే ఈ సర్వేని ససెమిరా అంగీకరించవు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.