TDP : ఒకప్పుడు మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ వేరు. అందులో దాదాపు నిజాలే ప్రసారం అయ్యేవి. ఏపార్టీకి ఏ ఛానెల్, పత్రిక కొమ్ముకాసినా సరే నిజాలను నిజాలుగానే చెప్పేవారు. అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంత ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజాల కంటే ముందే అబద్దాలు త్వరగా ప్రచారం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నిజాల కన్నా అబద్దాలే బలంగా దూసుకెళ్తున్నాయి. దాంతో ప్రజలు కూడా వాటినే నమ్మే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలో అధికారం ఎవరిది అంటే ఎవరికి వారే ఇలాంటి అబద్దాలనే రంగులు వేసి చూపిస్తున్నారు.
ఏ పార్టీ ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసి పోరాడినా.. చివరకు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏం చెప్పాలో అవి పార్టీల ముందు, ప్రజల ముందు ఉంచేశాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ను కూడా పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. వాటిలో తోతును వెతికి మరీ తమదే అధికారం అని చూపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. దాని సారాంశం ఏమంటే.. 1984, 1994,చ 2014, 2024 టీడీపీ గెలుపు అంటూ.. ఇది చూసిన టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తెగ సంబురపడిపోవాల్సిందే అన్నట్టు ఉంది.
ఎందుకంటే చివర 4 నెంబర్ వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీడీపీనే గెలిచిందని.. ఇప్పుడు కూడా కూటమిదే అధికారం అని చెబుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఓ విషయం మర్చిపోయినట్టున్నారు. అదేంటంటే ఈ పోస్టులో 2004ను ప్రస్తావించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చింది. మరి దాంట్లో కూడా చివర 4 నెంబర్ ఉంది కదా. అప్పుడు టీడీపీకి అధికారం దక్కలేదు. కానీ ఈ విషయాన్ని కప్పి పుచ్చేసి టీడీపీ నేతలను సంతృప్తి పరచడానికి ఈ పోస్టును ఎల్లో కలర్ వేసి రెడీ చేశారు.ఇది గమనిస్తే ఎవరికైనా ఏం తెలివిరా బాబు అనిపించకమానదేమో. మరి 2004 సీన్ రిపీట్ అవుతుందా.. లేదంటే 2014 సీన్ రిపీట్ అవుతుందా అనేది రెండు రోజులు ఆగితే తేలిపోతుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.