people believing ysrcp is the only party ofr bc's
tirupati : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నోటిఫిషన్ విడుదల అయ్యింది. వచ్చే నెల 17వ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఏమి జరిగిన విజయం వైసీపీదే అన్నట్లు మారిపోయింది పరిస్థితి. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ దూసుకొనివెళ్తుంది. ఫ్యాన్ గాలి దెబ్బకు మిగిలిన ప్రతిపక్షాలు కుదేలు అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో తిరుపతిలో ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు, కానీ మెజారిటీ ఎంత అనేది ఇక్కడ సమస్య, ఎందుకంటే మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కావచ్చు, నిన్నటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఘన విజయం సాధించింది. పైగా ఈ స్థానం కూడా వైసీపీ సిట్టింగ్ ఎంపీది. బల్లి దుర్గప్రసాద్ చనిపోవటంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228376 మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మే బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ రెండురోజుల క్రితం ప్రకటించింది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడికి కాకుండా కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నా… ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండదు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్‌ను ఇటీవల ఎమ్మెల్సీగా చేశారు.
ఇదిలా ఉండగా పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నామమాత్రంగా కూడా సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శించిన ఆధిక్యత కొనసాగాలంటే ఉప ఎన్నికలో కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. దానికి కొంచమైన తగ్గితే వైసీపీ విజయంలో కిక్ ఉండదు అనే చెప్పాలి.
ఒక పక్క వైసీపీ ఏమో మెజారిటీ ఎంత అనే దానిపై లెక్కలు వేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షము టీడీపీ మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని గతంలోనే ప్రకటించాడు చంద్రబాబు. అయితే పోటీచేయటానికి ఆమె అంత సుముఖంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా ఆమెను ఖరారు చేసిన తర్వాత పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఆమె ప్రభావం లేదు. ఇలాంటి స్థితిలో పోటీచేసి ఓటమి మూట కట్టుకోవటం అవసరమా అని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఆమె ఈ నెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె నామినేషన్ వేసేదాకా తెలియదు ఆమె పోటీలో ఉందో..? లేదో…? అని
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.